![ప్రశాంతంగా అమ్మవార్ల దర్శనం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11mul03-330117_mr-1739332266-0.jpg.webp?itok=vN_HdaRI)
ప్రశాంతంగా అమ్మవార్ల దర్శనం
ములుగు కలెక్టర్
దివాకర టీఎస్
ములుగు: నేటినుంచి 15వ తేదీ వరకు జరగనున్న మినీ మేడారం జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశామని ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించేందుకు నల్లాలు, మహిళా భక్తులు దుస్తులు మార్చుకునే గదులను సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు. ఇప్పటికే పారిశుద్ధ్య పనులు చేపట్టారని, వైద్యశాఖ తరఫున శిబిరాలు ఏర్పాటుచేసినట్లు వివరించారు. అమ్మవారి గద్దెల ప్రాంగణంలో, క్యూలైన్ వద్ద ప్రత్యేక పోలీసు సిబ్బందిని నియమించామని తెలిపారు. ఏటూరునాగారం మండలం కొండాయి, ఐలాపూర్ మినీ మేడారం జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆర్టీసీ తరఫున చిన్నబోయినపల్లి నుంచి కొండాయి వరకు, ఊరట్టం నుంచి కొండాయి వరకు ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నామని పేర్కొన్నారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో అమ్మవార్లను దర్శించుకొని ఇంటికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment