ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి రైతులు సహకరించాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద
వరంగల్: మమూనూరులో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి రైతులు సహకారం అందించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులతో ఎయిర్‌పోర్ట్ భూసేకరణకు గుంటూరుపల్లి, బొల్లికుంట గ్రామాల రైతులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎ యిర్‌పోర్ట్ రావడం ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన నగరాల్లో వరంగల్ కూడా ఒకటని, ఇందుకు రైతులు సహకరించాలని కోరారు. రైతులు కోరిన విధంగా రోడ్డు కనెక్టివిటీకి ప్రతిపాదనలు తయారుచేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, ఖిలా వరంగల్ తహసీల్దార్ నాగేశ్వర్‌రావు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment