మణికొండ మున్సిపల్ కార్యాలయంలో వద్ద ఏసీబీ అధికారులు
మణికొండ: మణికొండ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గతంలో ఇక్కడ డీఈఈగా పని చేసి బదిలీపై జీహెచ్‌ఎంసీకి వెళ్లిన దివ్యజ్యోతిపై.. సొంత భర్తే ఆమె అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు చేశారు.
ఇంట్లోని కరెన్సీ కట్టల వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అప్పట్లో కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. దర్యాప్తులో భాగంగా గతంలో దివ్యజ్యోతి పని చేసిన మణికొండ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం పలు దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో ఆమె చేసిన అభివృద్ధి ఎస్టిమేషన్‌లు, కాంట్రాక్టర్‌లకు ఇచ్చిన బిల్లుల వివరాల దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం మున్సిపల్ కమిషనర్ డి. ప్రదీప్‌కుమార్, ఏఈ సంజయ్‌ల మాట్లాడారు. ఆమె పని తీరు, కాంట్రాక్టర్‌లతో లావాదేవీలు తదితర విషయాలపై కూపీ లాగినట్టు సమాచారం. మున్సిపాలిటీ పరిధిలో కాంట్రాక్టర్‌లు, ప్రజాప్రతినిధులకు మేలు చేసే ఉద్దేశంతో పనులు చేపట్టినట్లు దివ్యజ్యోతిపై ఆరోపణలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment