నేడు మెట్‌పల్లికి హైకోర్టు న్యాయమూర్తి రాక
మెట్‌పల్లి: హైకోర్టు న్యాయమూర్తి వేణుగోపాల్ మెట్‌పల్లికి రానున్నారు. మెట్‌పల్లి మాజీ ఎమ్మెల్యే కొమొరెడ్డి జ్యోతక్క నివాసంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడానికి సోమవారం వస్తున్నారు. అనారోగ్యంతో ఇటీవల జ్యోతక్క మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె సోదరి కుమారుడైన వేణుగోపాల్..మంగళ, బుధవారాల్లో జరిగే జ్యోతక్క దశదినకర్మ, పెద్దకర్మ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు.
భరతనాట్యంలో ధర్మపురి చిన్నారికి అవార్డు
ధర్మపురి: తమిళనాడు రాష్ట్రం కంచీపురంలోని ఏకాంబర ఈశ్వర్ ఆలయంలో ఆదివారం నిర్వహించిన భరతనాట్యం పోటీల్లో ధర్మపురికి చెందిన చిన్నారికి నాట్యదేవతా అవార్డు అందించా రు. మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన వావిలాల జగదీశ్, హారిణి దంపతుల కూ తురు సోనాక్షి (8) కంచీలో నిర్వహించిన భరతనాట్య పోటీల్లో పాల్గొంది. చిన్నారి నృత్యప్రదర్శకు అవార్డును అందించి అభినందించారు.
‘సూరమ్మ’ కాలువల భూసేకరణకు రూ.10 కోట్లు
కథలాపూర్: కథలాపూర్, మేడిపెల్లి మండలాల్లో సూరమ్మ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల భూసేకరణకు రూ.10 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసినట్లు విప్ ఆది శ్రీనివాస్ ఆదివారం రాత్రి ప్రకటనలో తెలిపారు. వేములవాడ నియోజకవర్గంలో సాగునీటి ఇబ్బందులను ప్రభుత్వ విప్ ఆది దృష్టికి రైతులు తీసుకెళ్లగా, సూరమ్మ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి 50 వేల ఎకరాలకు నీరందిస్తామని ఇటీవలే హామీ ఇచ్చారు. హామీ మేరకు ప్రభుత్వాన్ని ఒప్పించి కుడి, ఎడమ కాలువల భూసేకరణకు నష్టపరిహారం కింద రూ.10 కోట్లు విప్ ఆది మంజూరు చేయించారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
ధర్మపురి: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. మండలంలోని కమలాపూర్, నేరెల్ల గ్రామాల్లో ఆదివారం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుముల లావణ్య లక్ష్మణ్, ఉపాధ్యక్షులు సంఘ నర్సింహులు శేర్ల రాజేశం, డైరెక్టర్లు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
బుగ్గారం: మండలంలోని సిరివంచకోటలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ధర్మపురి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ధర్మపురి మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ చిలుముల లావణ్య ప్రారంభించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు,స్థానిక నాయకులు,రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment