‘కొని’ తెచ్చుకుంటున్న అనారోగ్యం | - | Sakshi
Sakshi News home page

‘కొని’ తెచ్చుకుంటున్న అనారోగ్యం

Published Mon, Nov 18 2024 2:36 AM | Last Updated on Mon, Nov 18 2024 2:36 AM

‘కొని

‘కొని’ తెచ్చుకుంటున్న అనారోగ్యం

హోటళ్లలో పరిశుభ్రత ఎక్కడ?

తనిఖీలు లేవు.. మామూళ్లతో సరి

ఫుడ్‌సేఫ్టీ అధికారి ఉన్నా లేనట్లే..

జగిత్యాల: జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లు అపరిశుభ్రత, కుళ్లిన ఆహార పదార్థాలకు నిలయంగా మారాయి. ఇటీవల కొత్తబస్టాండ్‌ వద్ద ఓ హోటల్‌లో ఇడ్లీలో బొద్దింక రాగా, ఉడిపి హోటల్‌లో ఇడ్లీలో జెర్రీ, చపాతిలో ఫంగస్‌ రావడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. హోటళ్లలో శుభ్రత లోపిస్తుందని ఫిర్యాదులు వస్తున్నా మున్సిపల్‌, ఫుడ్‌సేఫ్టీ అధికారులు చర్యలు చేపట్టడం లేదు. హోటళ్లను తూతూమంత్రంగా తనిఖీ చేయడం, అందినంత తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఫుడ్‌ సేఫ్టీ అధికారికి ఫిర్యాదు చేసేందుకు ఫోన్‌ చేస్తే లిఫ్ట్‌ చేయరని, అసలు సదరు అధికారి ఉన్నది ఎందుకనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సదరు అధికారి ఫోన్‌ రిసీవ్‌ చేసుకోకపోవడంతో ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని పలువురు జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.

మున్సిపల్‌ అధికారులది అదేబాట

జిల్లా కేంద్రంలోని హోటళ్లను మున్సిపల్‌ అధికారులు నామమాత్రంగా తనిఖీ చేసి చిన్నపాటి జరిమానా విధిస్తూ వదిలేస్తున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని ఓ రెస్టారెంట్‌లో కుళ్లిన చికెన్‌, మాంసం, బూజుపట్టిన మసాలాలు దొరికగా రూ.వెయ్యి జరి మానా వేసి చేతులు దులుపుకున్నారు. పలు హోట ళ్లలో వంటగదులు శుభ్రంగా లేక, ఆ సమీపంలోనే పందులు, ఈగలు ఉండటం, కనీస నిబంధనలు పాటించకపోవడంతో ప్రజలు అనారోగ్యం కొని తె చ్చుకుంటున్నారు. జిల్లాలో సుమారు 500 హోట ళ్లు, టిఫిన్‌ సెంటర్లు ఉండగా, 20 వరకు రెస్టారెంట్లు ఉన్నాయి. కొన్నిచోట్ల వంట గదుల్లో ఎలుకలు, జెర్రీ లు, చిన్నచిన్న పురుగులు తిరుగుతున్నట్లు తని ఖీల్లో వెల్లడైనా అధికారులు పట్టించుకోవడం లేదు.

అంతా కుళ్లిపోయినవే..

ఇక ప్రధాన హోటళ్లలో చికెన్‌ బిర్యానీ, మటన్‌ బిర్యానీ, ఇతరత్ర పదార్థాలకు వాడే నూనె, కలర్స్‌, మసాలాలు, అల్లం ఉల్లిపాయలు బూజు పట్టి ఉంటున్నాయి. ఎప్పుడో తయారుచేసిన వాటిని వాడుతున్నారు. ఇటీవల కొత్తబస్టాండ్‌ వద్ద ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో తనిఖీలు చేయగా కుళ్లిన మాంసం, బూజుపట్టిన అల్లం పేస్ట్‌ ఫుడ్‌సేఫ్టీ అధికారి ఆధ్వర్యంలోనే బయటపడినా వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. తరుచూ షాంపిల్స్‌ సేకరించామని, రిపోర్టు రాగానే చర్యలు తీసుకుంటామని చెబుతూ చేతులు దులుపుకుంటున్నారు. అలాగే ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లను ఎక్కువగా విద్యార్థులు, నిరుద్యోగ యువత ఆశ్రయిస్తుంటారు. వీటిలో అత్యధికంగా కల్తీ జరుగుతోంది. చికెన్‌ కబాబ్‌, షవర్మా, చికెన్‌65, నూడూల్స్‌ తదితర పదార్థాలు విక్రయిస్తుంటారు. ఇందులో రకరకాల కలర్లు మిక్స్‌ చేయడంతో పాటు, ఇటీవల ప్రభుత్వం నిషేధించిన మయోనైజ్‌ను సైతం వాడుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి హోటళ్లు, రెస్టారెంట్లను తనిఖీ చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

‘ఇటీవల ఓ కుటుంబం ఇడ్లీ తిందామని స్థానిక తహసీల్‌ చౌరస్తాలో గల ఉడిపి హోటల్‌కు వెళ్లింది. ఇడ్లీలో జెర్రీ కనపడడంతో వెంటనే ఆహారభద్రత అధికారికి, మున్సిపల్‌కు ఫోన్‌ చేయగా ఎవరూ స్పందించలేదు. బాధితులు గొడవ చేయడంతో మున్సి పల్‌ అధికారులు వచ్చి సదరు ఇడ్లీలను డస్ట్‌బిన్‌లో పడేసి వెళ్లారు. మరునాడు ఆహారభద్ర త అధికారి వచ్చి హోటల్‌ను సీజ్‌ చేశారు. ఏ మైందో తెలియదు కానీ మరుసటి రోజే హో టల్‌ తెరిచారు. ప్రతీ చోట ఇలాగే జరుగుతోంది. తూతూమంత్రంగా తనిఖీలు చేయడం, వారి నుంచి ఆమ్యామ్యాలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి’.

No comments yet. Be the first to comment!
Add a comment
‘కొని’ తెచ్చుకుంటున్న అనారోగ్యం1
1/2

‘కొని’ తెచ్చుకుంటున్న అనారోగ్యం

‘కొని’ తెచ్చుకుంటున్న అనారోగ్యం2
2/2

‘కొని’ తెచ్చుకుంటున్న అనారోగ్యం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement