![డంపింగ్‌యార్డులో మంటలు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/18/17jgl79-180032_mr-1734460992-0.jpg.webp?itok=PUiDfP5C)
డంపింగ్‌యార్డులో మంటలు
● ప్రజలకు ఇబ్బందులు ● అధికారుల నిర్లక్ష్యమేనా..?
జగిత్యాల: జిల్లాకేంద్రంలోని చెత్తను తీసుకెళ్లి నూకపల్లి వద్దనున్న డంపింగ్‌యార్డులో పడేస్తుంటున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు డంపింగ్‌యార్డుకు నిప్పు పెట్టడంతో మంటలు ఎగిసిపడ్డాయి. చెత్త వ్యర్థాలు గాలిలో కలిసి ఆ ప్రాంతమంతా వ్యాపించింది. పొగ ప్రభావంతో డబుల్‌బెడ్‌రూం ఇళ్లలో ఉంటున్నవారు.. నర్సింగాపూర్ గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ డంపింగ్‌యార్డు వద్దని ప్రజలు గతంలోనే పేర్కొన్నా.. అధికారులు వినిపించుకోలేదు. ప్రతిసారి డంపింగ్‌యార్డు తగలబడుతుండడంతో అక్కడున్న ప్రజలకు ఇబ్బందికరంగా మారింది.
అధికారుల నిర్లక్ష్యమేనా...
డంపింగ్‌యార్డు తగలబడటంలో అధికారుల నిర్లక్ష్యమో.. లేక కావాలని ఎవరైనా నిప్పుపెట్టారా..? తెలియడం లేదు. వాస్తవానికి ప్లాస్టిక్ వ్యర్థాలు ఒకవైపు, చెత్తాచెదారం మరోవైపు వేయాలి. ఎన్విరాన్‌మెంటల్ అధికారులు పట్టించుకోకపోవడంతో డంపింగ్‌యార్డులో ఇష్టానుసారంగా పడేస్తున్నారు. ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని పొగలు వ్యాపిస్తున్నాయి. తద్వారా క్యాన్సర్, లుమేరియా, గుండెజబ్బులు వస్తాయంటున్న వైద్యులు.
Comments
Please login to add a commentAdd a comment