నిచ్చెన ఎక్కి.. ఆస్పత్రి పరిశీలించి..
రాయికల్: కలెక్టర్ సత్యప్రసాద్ రాయికల్ ఆస్పత్రిని మంగళవారం సందర్శించారు. ఆస్పత్రి ఆవరణను కలియతిరిగారు. వర్షం వస్తే ఆస్పత్రి ఉరుస్తోందని సూపరింటెండెంట్ శశికాంత్‌రెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. స్వయంగా ఆస్పత్రిలోని నిచ్చెన సహాయంతో ఆస్పత్రి పైకి ఎక్కి పరిశీలించారు. సమస్యలన్నీ తెలుసుకుకున్నారు. శానిటేషన్ కోసం యుద్ధప్రతిపాదికన రూ.10లక్షలు మంజూరు చేశారు. 15 రోజుల్లో పనులు పూర్తి చేయాలని కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, పంచాయతీరాజ్ ఏఈ ప్రసాద్‌ను ఆదేశించారు. తహసీల్దార్ ఖయ్యూం, కౌన్సిలర్ గండ్ర రమాదేవి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment