ఇళ్ల సర్వే పకడ్బందీగా చేపట్టాలి
మల్లాపూర్: ఇందిరమ్మ ఇళ్ల సర్వే పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలంలోని సాతారంలో చేపడుతున్న సర్వేను తనిఖీ చేశారు. ప్రజాపాలనలో చేసుకున్న దరఖాస్తుల ఆధారంగా నిరుపేదలను గుర్తించి మంజూరు చేస్తామన్నారు. లబ్ధిదారుల వివరాలను యాప్‌లో పొందుపర్చాలని సూచించారు. ఆర్డీవో శ్రీనివాస్, హౌసింగ్ ఈఈ రాజేశ్వర్, పీఆర్ ఈఈ అబ్దుల్ రెహమన్, తహసీల్దార్ వీర్‌సింగ్, ఎంపీడీవో జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ వేంపల్లి, సాతారంలో నిర్మిస్తున్న హెల్త్ సబ్‌సెంటర్ల పనులను పరిశీలించారు.
పశుగణన చేపట్టాలి
జగిత్యాల: జిల్లాలో పశుగణన పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ అన్నారు. పశువైద్యాధికారులతో సమీక్షించారు. ఫిబ్రవరి 2025 వరకు కొనసాగుతుందన్నారు. మూడు నెలలుగా పశువులకు గాలికుంటు నివారణ టీకీలు, పీపీఆర్ టీకాలు వేశామన్నారు. పశుసంవర్దక శాఖ అధికారి మనోహర్, ఏడీ బోనగిరి నరేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment