పెన్షనర్లను ప్రతి ఒక్కరూ గౌరవించాలి
జగిత్యాల: పెన్షనర్లను ప్రతి ఒక్కరూ గౌరవించాలని జిల్లా ట్రెజరీ అధికారి సీహెచ్.సోఫియా అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జాతీయ పెన్షనర్స్ దినోత్సవంలోపాల్గొని మాట్లాడారు. కనీస సదుపాయాలు లేని మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగులు, పెన్షనర్లు ప్రజలకు సేవలందిస్తూ ప్రభుత్వ కార్యక్రమాల్లో విజయవంతం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్, అధికారులు మధుకర్, గణేశ్, హన్మంతరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ధర్మపురి: ధర్మపురిలోని బ్రాహ్మణ సంఘం భవనంలో మంగళవారం పెన్సనర్ల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు కొరిడె విశ్వనాథశర్మ, పానుగంటి దత్తాత్రి, చిన్న రామకిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment