నిబంధనల ప్రకారమే గ్రానైట్ రవాణా చేయాలి
జగిత్యాలక్రైం: నిబంధనల ప్రకారమే గ్రానైట్ రవాణా చేయాలని జిల్లా మైనింగ్ అధికారి జైసింగ్ అన్నారు. మంగళవారం మోతె బైపాస్ శివారులో మైనింగ్, రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. గ్రానైట్ తరలిస్తున్న వాహనాలను పరిశీలించారు. పరిమితికి మించి ఇసుక తరలిస్తున్న వాహనానికి రూ.3,250 జరిమానా విధించారు. క్రషర్లు కూడా ప్రభుత్వ నిబంధనలకు లోబడే నిర్వహించాలన్నారు. అనుమతులు లేకుండా ఇసుక, గ్రానైట్ తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎంవీఐ తిరుపతిరావు, కానిస్టేబుల్ బాలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment