స్వచ్ఛంద సంస్థ పేరిట ఘరానా మోసం
సిరిసిల్లటౌన్: స్వచ్ఛంద సంస్థ ద్వారా తక్కువ ధరకే డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ సమీప బంధువు కావడంతోనే నమ్మి మోసపోయినట్లు ముస్తాబాద్ మండలం మోహినికుంట, మద్దికుంట గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్‌కు తరలివచ్చి విలేకరులతో తమ గోడు వెల్లబోసుకున్నారు. 2020లో బెంగళూరుకు చెందిన శ్రీహోలి వరల్డ్స్ సిటిజెన్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌శ్రీ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తమ గ్రామాలకు వచ్చారన్నారు. సొంత స్థలం ఉన్న వారికి రూ.3.50 లక్షలకే కేంద్ర, రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా వచ్చే డబ్బులతో ఇల్లు కట్టిస్తామని నమ్మబలి కారని తెలిపారు. అప్పటి సీఎం కేసీఆర్‌కు సమీప బంధువైన ప్రజాప్రతినిధితో తమతో మాట్లాడించగా.. 70 మందిమి రూ.కోటి వరకు చెల్లించినట్లు వివరించారు. రెండేళ్ల తర్వాత కూడా ఇండ్లు నిర్మించకపోగా.. 2022లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దీంతో సదరు ప్రజాప్రతినిధితో వచ్చి సంస్థ ప్రతినిధులు చెక్కులు అందించి తమ వద్ద ఉన్న సంస్థకు చెందిన బాండ్లను తీసుకున్నారన్నారు. చెక్కులు ఇచ్చారుగా గొడవ చేయొద్దని సదరు ప్రజాప్రతినిధి తెలిపారని, అయినా చెక్కులు ఇప్పటికీ పాస్ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు బాధ్యులను ప్రశ్నిస్తే ఏం చేసుకుంటారో చేసుకోండ్రని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కలెక్టరేట్‌కు తరలి వచ్చిన బాధితులు
Comments
Please login to add a commentAdd a comment