హ్యాండ్‌బాల్ చాంపియన్ కరీంనగర్
కరీంనగర్ స్పోర్ట్స్: కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో మూడు రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి 46వ జూనియర్ హ్యాండ్‌బాల్ పోటీలు సోమవారంతో ముగిశాయి. చాంపియన్‌గా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టు జయకేతనం ఎగురవేసింది. ద్వితీయ, తృతీయస్థానాల్లో వరంగల్, మహబూబ్‌నగర్, నాలుగోస్థానంలో ఆదిలాబాద్ జట్లు నిలిచాయి. పోటీలకు రాష్ట్రంలోనే పాతపది జిల్లాలనుంచి 200మంది క్రీడాకారులు, 50మంది కోచ్‌లు హాజరయ్యారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జాతీయపోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు నిర్వాహకులు ఎంపిక చేశారు. అంతకుముందు కరీంనగర్, వరంగల్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగగా 18–16 స్కోరు తేడాతో కరీంనగర్ విజేతగా నిలిచింది. సాయంత్రం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి డీవైస్‌వో శ్రీనివాస్‌గౌడ్, డీఆర్‌వో పవన్‌కుమార్, బీసీ వెల్ఫేర్ అధికారి అనిల్‌కుమార్, రాష్ట్ర హ్యాండ్‌బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్‌కుమార్ హాజరై విజేతలకు ట్రోపీలు అందించారు. ఎస్‌జీఎఫ్ కార్యదర్శి వేణుగోపాల్, ఉమ్మడి జిల్లా హ్యాండ్‌బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి బసరవేణి లక్ష్మణ్, సంయుక్త కార్యదర్శి నెమలికొండ ప్రభాకర్, రెఫరీల బోర్డు కన్వీనర్ ఇంద్రసేనారెడ్డి, మూల వెంకటేశ్ పాల్గొన్నారు.
ముగిసిన రాష్ట్రస్థాయి పోటీలు
Comments
Please login to add a commentAdd a comment