సీపీఐది పోరాటాల ఘనత
చిగురుమామిడి: భారతదేశ గడ్డపై వందేళ్ల మహోజ్వల పోరాటాలు, త్యాగాల చరిత్ర కలిగిన పార్టీ ఒక్క సీపీఐ మాత్రమేనని పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. సీపీఐ వందేళ్ల ఉత్సవాల్లో భాగంగా సోమవారం చిగురుమామిడిలో రెడ్‌షర్ట్ వలంటీర్లు వంద జెండాలు చేతబట్టి సర్దార్ సర్వాయిపాపన్న విగ్రహం నుంచి బస్టాండ్ మీదుగా మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ వరకు భారీర్యాలీ నిర్వహించారు. చాడ వెంకట్‌రెడ్డి, మర్రి వెంకటస్వామి ర్యాలీలో పాల్గొన్నారు. సభకు మండల సీపీఐ కార్యదర్శి లక్ష్మారెడ్డి అధ్యక్షత వహించారు. చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. 1925 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో సీపీఐ ఆవిర్భవించిందన్నారు. వేలాదిమంది అమరవీరుల త్యాగాల ఫలితంగా నేటికీ పార్టీ మనుగడ కొనసాగుతోందన్నారు. చిగురుమామిడి మండలం ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు సీపీఐకి కంచుకోటగా ఉందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటాలని సూచించారు. పార్టీ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో సీపీఐకి చిగురుమామిడి గుండెకాయలాంటిదన్నారు. పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యుడు అందెస్వామి, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, జిల్లా కౌన్సిల్ సభ్యుడు అందె చిన్నస్వామి, చాడ శ్రీధర్‌రెడ్డి, ముద్రకోల రాజయ్య, కాంతాల శ్రీనివాస్‌రెడ్డి, ఇల్లందుల రాజయ్య, బోయిని పటేల్ పాల్గొన్నారు.
పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment