సోమేశ్వర ఆలయంలో పీఠాధిపతి పూజలు
పాలకుర్తి టౌన్: సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో ఆదివారం నైమిశారణ్య పీఠాధిపతి బాల బ్రహ్మనంద సరస్వతి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలబ్రహ్మనంద సరస్వతికి అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ముఖమంటపంలో శివకేవుల తత్వ ప్రవచనం చేశారు. ఆలయ ఈఓ సల్వాది మోహన్‌బాబు, సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, అర్చకులు డీవీఆర్‌శర్మ, దేవగిరి అనిల్‌కుమార్, మత్తగజం నాగరాజు, భక్తులు పాల్గొన్నారు.
బీసీలు రాజ్యాధికారం
దిశగా అడుగులు వేయాలి
జనగామ రూరల్: రాష్ట్ర జనాభాలో ఎక్కువగా ఉన్న బీసీలు ఐక్యంగా ఉండి రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చిర్ర వీరస్వామి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో బీసీ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీలందరూ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులుగా పోటీ చేయాలన్నారు. బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. అనంతరం పట్టణ అధ్యక్షుడిగా మారబోయిన శ్రీనివాస్‌ను ఎన్నుకొని నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గుర్రాల సురేష్, ఉపాధ్యక్షుడు నిమ్మల కుమారస్వామి, యువజన విభాగం అధ్యక్షుడు పండుగా హరీష్, కార్యదర్శి పిట్టల రజనీకాంత్, లింగాలఘణపురం కార్యదర్శి దూసరి శంకర్, రాజు, యాకన్న, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ బిల్లులు
చెల్లించాలి
జనగామ రూరల్: విద్యారంగ సమస్యలు పరిష్కరించి తక్షణమే పెండింగ్ బిల్లులను చెల్లించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మాణిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో 5వ మహాసభను ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభకు జిల్లా అధ్యక్షుడు పి.చంద్రశేఖర్ రావు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా మాణిక్ రెడ్డి హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక గ్యారంటీలను హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏడాది సంబురాలు జరుపుతున్నారని విద్యారంగ సమస్యలు పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. ఉన్న బడులను బాగు చేయాల్సిన అవసరాన్ని పక్కన పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో మరో కొత్త బడులకు శ్రీకారం చుట్టారని విమర్శించారు. రాష్ట్ర కార్యదర్శి కానుగంటి రంజిత్ కుమార్ మాట్లాడుతూ పాఠశాల విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమయిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు మంగు జయప్రకాశ్, ఉపాధ్యక్షురాలు తాళ్లపెళ్లి హేమలత, కోశాధికారి తాడూరి సుధాకర్, జిల్లా కార్యదర్శులు యాదవరెడ్డి, చిక్కుడు శ్రీనివాస్, మడూరి వెంకటేష్, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.
డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదల
విద్యారణ్యపురి: హనుమకొండలోని వడ్డేపల్లిలో ని ప్రభుత్వ పింగిళి మహిళా కళాశాల (అటానమస్) 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించిన డిగ్రీ కోర్సుల రెండో సంవత్సరం మూడో సెమిస్టర్, మూడో సంవత్సరం ఐదో సె మిస్టర్ పరీక్షల ఫలితాల్ని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్ విడుదల చేసినట్లు ఆదివారం ఆ కళాశాల ప్రిన్సిపా ల్ డాక్టర్ చంద్రమౌళి తెలిపారు. డిగ్రీ బీఏ, బీ కాం, బీఎస్సీ మూడో సెమిస్టర్ పరీక్షల్లో మొత్తం 458 మంది విద్యార్థులకుగాను 453 మంది పరీక్షలు రాయగా.. వారిలో 332 మంది (73. 29 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఐదో సెమి స్టర్ పరీక్షలకు 412 మంది పరీక్షలకు హాజరుకాగా అందులో 340 మంది (82.52 శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు చంద్రమౌళి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment