జ్యుడీషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక
జనగామ రూరల్: జిల్లా జ్యుడీషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నూతన కమిటీని బుధవారం జిల్లా కేంద్రంలో ఎన్నుకున్నారు. ఎండీ.రహీముద్దీన్ ఎన్ని కల అధికారిగా వ్యవహరించగా ఆల్ ఇండియా సెక్రటరీ కుమ్మరి జగన్నాథం ముఖ్యఅతిథిగా పాల్గొని ఎన్నికై న వారికి నియామకపత్రాలు అందజేశారు. అధ్యక్షుడిగా ఎదునూరి వెంకటనారాయణ, ప్రధాన కార్యదర్శిగా కాగితోజు దామోదరా చారి, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా రాయల సంపత్‌కుమార్, వైస్ ప్రెసిడెంట్లుగా బానోత్ పూల్‌చంద్, బలిజ ప్రతిభ, టి.రాజేందర్‌సింగ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా గనబోయిన మహేందర్, కోశాధికారిగా లకావత్ తిరుపతి, జూయింట్ సెక్రటరీలుగా దేవర స్వేత, పి.రమ్య, రాజేంద్రప్రసాద్ ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment