బ్యాంకింగ్ రంగంలో అగ్రగామి
జనగామ: వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్.. బ్యాంకింగ్ రంగంలో అగ్రగామిగా ఉందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆ బ్యాంకు సేవల ను బుధవారం చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావుతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. 1994లో ఆవిర్భవించిన ఈ బ్యాంకు ఇప్పటి వరకు రూ.400 కోట్ల మేర టర్నోవర్ పూర్తి చేసుకుని, త్వరలోనే వడ్డేపల్లిలో నూతన శాఖ ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పి.జమున, బాయిల్డ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పజ్జూరి జయహరి, చాంబర్ అధ్యక్షుడు పి.లింగయ్య, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, బ్యాంకు డైరెక్టర్లు, సీఈఓ, మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.
ఆస్పత్రి సేవలను వినియోగించుకోవాలి
బచ్చన్నపేట : ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుతున్న మెరుగైన వైద్య సేవలను ప్రజలు వినియోగించుకో వాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. స్థాని క ప్రభుత్వ ఆస్పత్రికి మంజూరైన 108 వాహనాన్ని ఆయన బుధవారం ప్రారంభించి మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మండలానికి అంబులెన్స్ ఇచ్చామని, రాష్ట్రంలోని ప్రతీ మ ండలానికి ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం ఇవ్వగా అసెంబ్లీలో ప్రస్తావిస్తానని అన్నారు. అలాగే చిన్నరామన్‌చర్లలో ఇటీవల మృతి చెందిన గుండ మల్లేశం కుటుంబాన్ని పరామర్శించి రూ.5వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. నాయకులు ఇర్రి రమణారెడ్డి, చెంద్రారెడ్డి, గంగం సతీ ష్ రెడ్డి, వెంకట్‌రెడ్డి, అజీమ్, రాజనర్సు, నర్సిరెడ్డి, కనకయ్య, ప్రతాప్‌రెడ్డి, వేణు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment