శరణం శరణం అయ్యప్ప
పడిపూజను వీక్షిస్తున్న అయ్యప్ప స్వాములు
మహాపడిపూజ నిర్వహిస్తున్న గురుస్వాములు
● వైభవంగా మహాపడిపూజ ● తరలివచ్చిన భక్తులు, స్వాములు
జనగామ: అయ్యప్ప శరణు ఘోషతో జిల్లా కేంద్రం మార్మోగింది. పాతబీటు బజారు శ్రీరామనవమి పందిరి ప్రాంతంలో ‘శరణం శబరేశా’ భక్త బృందం ఆధ్వర్యాన బుధవారం రాత్రి అయ్యప్ప మహాపడిపూజ నిర్వహించారు. శబరిమల సన్నిధానం ప్రధాన పూజారిగా స్వామికి సేవ చేసిన బ్రహ్మశ్రీ పరమేశ్వరన్ వాసుదేవన్ నంబూద్రి పర్యవేక్షణలో జరిగిన పడిపూజను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి అయ్యప్ప స్వాములు, భక్తులు తరలివచ్చారు. ప్రముఖ గాన గంధర్వులు, కళైమామని, హరివరాసనం అవార్డు గ్రహీత వీరమణిరాజు, అభిషేక్‌రాజు బృందం ఆలపించిన గీతాలు మంత్రముగ్దులను చేశాయి. ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పూజలో పాల్గొనగా గురు స్వాములు ఆశీర్వచనాలు అందించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ పి.జమునలింగయ్య, బీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేష్‌రెడ్డి, బాల్దె సిద్ధిలింగం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment