వివరాలు క్షేత్ర స్థాయిలో సేకరించాలి
జనగామ రూరల్: ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను క్షేత్ర స్థాయిలో నెలాఖరు లో గా సేకరించాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం సచివాలయం నుంచి ప్రభు త్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి శాంతికుమారి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం, అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు పింకేష్‌కుమార్, రోహిత్ సింగ్, డీసీపీ రాజమహేంద్రనాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ. ప్రజాపాలన ద్వారా సుమారు 80 లక్షల ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులొచ్చాయని, ప్రతీ 500 దరఖాస్తులకు ఒక సర్వేయర్‌ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతీ సర్వేయర్ రోజుకు 20 ఇళ్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి ఫొటో నమోదు చేయాలని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ ఈనెల 14న జిల్లాలోని రెసిడెన్షియల్, మోడల్, ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీలు, సంక్షేమ హాస్టళ్లలో 40 శాతం డైట్ చార్జీల పెంపు లాంచింగ్ కార్యక్ర మాన్ని ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. గ్రూప్ 2 పరీక్షల్లో అభ్యర్థుల కు ప్రత్యేకంగా ఓఎంఆర్ షీట్ ఇస్తామని, పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని కోరారు. వీసీలో ఆర్డీఓ లు గోపిరామ్, వెంకన్న, ఏసీపీ పార్థసారథి, జెడ్పీ సీఈఓ మాధురీషా, సీపీఓ పాపయ్య, బీసీ వెల్ఫేర్ అధికారి రవీందర్, డీఈఓ రమేష్, హౌసింగ్ ఈఈ దామోదర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
వీసీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment