రెండు గంటల నిరీక్షణ
● ఆర్టీసీ బస్సు రాక కాలినడకన
ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు
రఘునాథపల్లి: మండలంలోని వెల్ది మోడల్ స్కూల్‌కు రోజువారీగా వచ్చే ఆర్టీసీ బస్సు సకాలంలో రాకపోవడంతో విద్యార్థులు కాలినడకన ఇబ్బందులు పడుతూ ఇళ్లకు చేరిన సంఘట బుధవారం చోటు చేసుకుంది. మోడల్ స్కూల్‌లో చదివే కంచనపల్లి, కోడూర్, గబ్బెట తదితర గ్రామాలకు చెందిన విద్యార్థుల సౌకర్యార్థం కొన్నేళ్లుగా ఉదయం, సాయంత్రం ఆర్టీసీ బస్సు నడుపుతున్నారు. బుధవారం సాయంత్రం బస్సు రాక పోవడంతో దాదా పు రెండు గంటల పాటు విద్యార్థులు వేచి చూసి చీకటి పడుతుండగా.. వణుకుతూనే కిలోమీటర్ల దూరం కాలినడకన గమ్యస్థానాలకు చేరుకున్నారు. విద్యార్థులంతా వెళ్లిపోయిన తర్వాత బస్సు రావ డం గమనార్హం. ఈ విషయమై ఆర్టీసీ అధికారులను వివరణ కోరగా వెల్ది మోడల్ స్కూల్‌కు వెళ్లే బస్సు ఉప్పల్‌కు వెళ్లి వచ్చే క్రమంలో ట్రాఫిక్‌జామ్ కారణంగా ఆలస్యమైందని, మరో బస్సు పంపిస్తామంటే డ్రైవర్ల కొరత ఉందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment