సంక్షేమానికి ఏడాది!
జనగామ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలను నిర్వహించుకుంటోంది. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టి నేటికి (సోమవారం) ఏడాది పూర్తి చేసుకుంటోంది. ఎన్నికల సమయంలో మహాలక్ష్మి, యువ వికాసం, రైతు భరోసా, వరి పంటకు రూ.5వందల బోనస్, చేయూత స్కీం, గృహజ్యోతి పథకం, నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో పాటు ప్రజా అవసరాలకు తగ్గట్టుగా తమ పరిపాలన ఉంటుందని భరోసా కల్పించారు. దీంతో ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తుల మేరకు అర్హులైన వారికి పథకాలను వర్తింపజేస్తున్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం, డీఎస్సీ, గ్రూప్– 1, 2, 3, 4 ద్వారా వందలాది మంది నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగాలు కల్పిస్తోంది. 317 జీఓ ద్వారా మ్యూచువల్ బదిలీలకు అవకాశం కల్పించగా, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
ఆర్టీసీలో జోష్..
12 నెలల కాలంలో ఇప్పటి వరకు జనగామ డిపో పరిధిలో 1.29 లక్షల మందికి పైగా ఉచితంగా ప్రయాణం చేయగా, రూ.61.57 కోట్ల మేర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించింది. రోజువారీగా 37,805 మంది మహిళా ప్రయాణికులు ప్రయాణం చేయగా, రూ.18 లక్షల వరకు టికెట్ కలెక్షన్లు వచ్చాయి. అలాగే జిల్లాలో 1.67లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉండగా, 86,430 మంది వినియోగదారులకు రూ.5వందల చొప్పున సిలిండర్లు అందిస్తున్నారు.
87,877 మందికి ఉచిత కరెంట్
జిల్లాలో 1,37,989 విద్యుత్ కనెక్షన్లు ఉండగా గృహజ్యోతి పథకంలో 87,877 మంది వినియోగదారులకు 200 యూనిట్ల చొప్పున ఉచితంగా అందించారు. ఇప్పటి వరకు రూ.21.87కోట్ల లబ్ధి చేకూరగా ఈ మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. అలాగే రుణమాఫీలో భాగంగా జిల్లాలోని 54,548 మంది రైతులకు రూ.469.32 కోట్ల మేర మాఫీ కాగా, ఇంకా రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుంది.
ఆర్టీసీలో ఉచిత ప్రయాణం..
రైతులకు రుణమాఫీ
నిరుద్యోగులకు ఉద్యోగాలు..
ఉచిత విద్యుత్
ప్రారంభమైన ఇందిరమ్మ ఇళ్ల సర్వే
నేటితో కాంగ్రెస్ ప్రభుత్వానికి
ఏడాది పూర్తి
Comments
Please login to add a commentAdd a comment