ఏడాదిలో 55వేల ఉద్యోగాలు
మడికొండ: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 55,143 ఉద్యోగాలను భర్తీ చేసిందని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం మడికొండ శివారులోని ఓ కన్వేషన్ హాల్‌లో జరిగిన స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే డీఎస్సీ ద్వారా 11వేల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. కాళేశ్వరం నుంచి నీటిని ఉపయోగించకుండా 1.53 మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు చేస్తున్న విషప్రచారాన్ని కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారన్నారు. వంద పడకల ఆస్పత్రి ని ర్మాణం, డిగ్రీ కళాశాల నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ కా ర్యాలయ నిర్మాణాలకు నిధులు మంజూరు చేశారన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను రేవంత్‌రెడ్డి బయటకు తీస్తుంటే వారికి భయం పు ట్టుకుందన్నారు. అనంతరం వివిధ మండలాలకు కొత్తగా ఎంపికై న కాంగ్రెస్ పార్టీ నాయకులను, నామినేటెడ్ పోస్టులను పొందిన వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాష్‌రెడ్డి, జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, హజ్ కమిటీ అధ్యక్షుడు ఖుష్రుపాషా, నాయకులు అమృతరావు కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ నిరుద్యోగులను మోసం చేసింది
స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం
Comments
Please login to add a commentAdd a comment