జనగామ రూరల్: నేటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న సైన్స్ మేళాకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు డీఈఓ రమేశ్, సైన్స్ అధికారి సీహెచ్ ఉ పేందర్ తెలిపారు. పట్టణంలోని సెయింట్ పాల్స్ హైస్కూల్‌లో 9, 10 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా 6 నుంచి 10వ తరగతి విద్యార్థులతో ఇన్‌స్పైర్, వైజ్ఞానిక మేళా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఇన్‌స్పైర్‌లో భాగంగా 252 ఎగ్జిబిట్లను ప్రదర్శించనున్నారు. విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికి తీ యడానికి ఇది చక్కటి వేదిక అని, భావిభారత శాస్త్రవేత్తలుగా ఎదగడానికి, విద్యార్థుల్లో ఆసక్తి పెంపొందించే విధంగా ప్రదర్శనలు ఉంటాయన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 252 ఎగ్జిబిట్ల ప్రదర్శన
Comments
Please login to add a commentAdd a comment