జనగామ రూరల్: వ్యాయామ ఉపాధ్యాయులకు ఇన్ సర్వీస్ బీపీఈడీకు అవకాశం ఇవ్వాలని జిల్లా అధ్యక్షుడు గోరుసింగ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని ఉన్నత పాఠశాలలో తెలంగాణ వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సీఎం కప్పు వేసవి సెలవుల్లో సేవలందించిన వ్యాయామ విద్య ఉపాధ్యాయులకు ఎర్న్‌డ్ లీవులు మంజూరు చేయాలన్నారు. అనంతరం నూతన కమిటీ అధ్యక్షుడిగా జాటోత్ గోర్ సింగ్, ప్రధాన కార్యదర్శిగా గంగిశెట్టి మనోజ్ కుమార్, కొండ రవి, ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన కమిటీ సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీను, కిషన్, రవికుమార్, కిష్టయ్య, సైదులు, మాధవి, సుధారాని, సంగీత మాధురి, రవీంద్ర ప్రసాద్, సుభాష్, రాము, దిలీప్, నరేష్, గుణవర్ధన్, ఉపేందర్, రంజిత్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment