ఆకట్టుకున్న ప్రదర్శనలు
విద్యార్థికి మెమోంటో, ప్రశంస పత్రం అందిస్తున్న కలెక్టర్
అడవి జంతువుల నుంచి పంటలను కాపాడుకునే యంత్రం ప్రదర్శించిన విద్యార్థులు వర్షిత, హర్షవర్ధన్
నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే విధానాన్ని వివరిస్తున్న విద్యార్థిని కృతిక
జనగామ: జిల్లా కేంద్రంలోని నెహ్రూపార్క్ సెయింట్ పాల్స్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్‌స్పైర్ 2024 ఆకట్టుకుంది. రెండు రోజుల ప్రదర్శనలో భాగంగా మంగళవారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు సైన్స్ ప్రదర్శనలో 205, ఇన్‌స్పైర్‌లో 60 ప్రయోగాలు చేసి తమ ప్రతిభను చాటుకున్నారు. మంగళవారం జరిగిన ముగింపు వేడుకలో కలెక్టర్ రిజ్వాన్ బాషా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మహనీయులు శ్రీనివాస రామానుజన్, సీవీ రామన్, అబ్దుల్ కలాం చిత్రపటాలకు పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు తమ ఆలోచనలకు పదును పెట్టి వైజ్ఞానిక ప్రదర్శనలతో శాస్త్రీయ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. విజ్ఞానం, ఆవిష్కరణ రెండు వేర్వేరు అన్నారు. విజ్ఞానం మానవ మనుగడకు ఉపయోగానికి అవసరపడితే, ఆవిష్కరణ మానవ జాతికి అవసరమైన వాటిని తయారు చేసుకోవడమన్నారు. భారత శాస్త్రవేత్తలను స్ఫూర్తిగా తీసుకొని, దేశ మనుగడకు ఉపయోగకరంగా ఉండే విజ్ఞానాన్ని ప్రదర్శించాలన్నారు. జాతీయ స్థాయి ఇన్‌స్పైర్ పరిశీలకులు పింటు హతి మాట్లాడుతూ వైజ్ఞానిక ప్రదర్శనలు, ఇన్‌స్పైర్ ప్రాజెక్టులను తయారు చేసిన విద్యార్థులు, అందుకు సహకరించిన ఉపాధ్యాయులు, ప్రదర్శన ను సక్సెస్ చేసిన విద్యాశాఖ, సెయింట్ పాల్స్ యాజమాన్యాన్ని అభినందనీయమన్నారు. అంతకు ముందు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
విజేతలకు బహుమతులు
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు సైన్స్ ప్రదర్శనలో 205, ఇన్‌స్పైర్‌లో 60 ప్రయోగాలు చేసి తమ ప్రతిభను చాటుకున్నారు. ఇందులో 21 ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యా యి. సమాజానికి ఉపయోగపడే ప్రదర్శనలు 8, సైన్స్ ఫెయిర్‌లో సీనియర్, జూనియర్ విభాగంలో 32 మంది విజేతలకు కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రాలతో పాటు మెమోంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రమేష్, ప్రిన్సిపాల్ మారియా జోసెఫ్, జిల్లా సైన్స్ కో–ఆర్డినేటర్ ఉపేందర్, డీసీఈబీ సెక్రటరీ చంద్రభాను, మండల విద్యాధికారులు రాజేందర్, పి.నర్సయ్య, రఘునందన్‌రెడ్డి, కళావతి, జానకి దేవి, జిల్లా సమగ్ర శిక్ష కో–ఆర్డినేటర్లు తోట రాజు, బి. శ్రీనివాస్, నరసింహరావు, శ్రీకాంత్ రెడ్డి, ఏపీఓ శ్రీధర్, డీసీఈబీ సహాయ కార్యదర్శి రామరాజు, ప్రధానోపాధ్యాయులు పి.రమేష్, మల్లికార్జున్, శోభన్‌బాబు, తది తరులు పాల్గొన్నారు. కాగా రెండు రోజుల్లో జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన 15వేల మందికి పైగా విద్యార్థులు ప్రాజెక్టులను సందర్శించారు.
ఎమ్మెల్సీ, డీసీపీ సందర్శన
సైన్స్ ఫెయిర్‌ను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, డీసీపీ రాజమహేంద్రనాయక్ సందర్శించి విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టుల ఉపయోగాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆలోచనలు చాలా గొప్పగా ఉన్నాయని, భవిష్యత్‌లో బావి భారత శాస్త్రవేత్తలు కావాలని ఆకాంక్షించారు.
అంధులకు అల్ట్రాసోనిక్..
అల్ట్రాసోనిక్ సెన్సార్ అడ్డంకులను గుర్తించి బజర్ ద్వారా బీప్ సిగ్నల్‌తో అంధులను హెచ్చరిస్తుంది. మైక్రో కంట్రోలర్ సిగ్నల్స్‌ని ప్రాసెస్ చేసి అడ్డంకి దూరాన్ని గుర్తించి బీప్ ధ్వనితో సూచిస్తుంది. స్థానికంగా అందుబాటులో ఉన్న పరికరాలతో తయారు చేసుకుని, అంధులు అడ్డంకులను సులభంగా గుర్తించవచ్చు. పైగా ఆపరేట్ చేయడం సులభం.
– బెలిదె సాత్విక్, బాలయేసు హైస్కూల్, దేవరుప్పుల
ఆలోచనలకు పదును పెట్టాలి
జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్‌స్పైర్ ముగింపులో కలెక్టర్ రిజ్వాన్ బాషా
21 ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి ఎంపిక
Comments
Please login to add a commentAdd a comment