స్వచ్ఛత కోసమే పక్షోత్సవాలు
● డీఆర్‌డీఓ వసంత
జనగామ: గ్రామాల్లో సుస్థిరమైన స్వచ్ఛత కోసమే ప్రపంచ మరుగుదొడ్ల పక్షోత్సవాలను 21 రోజుల పాటు నిర్వహించినట్లు డీఆర్‌డీఓ వసంత తెలిపారు. మంగళవారం పక్షోత్సవాల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీఆర్‌డీఓ మాట్లాడుతూ ఘణ, ద్రవ వ్యర్థాల నిర్వహణ అవసరాలను గుర్తించి లక్ష్య సాధన కోసం ప్రణాళికలను రూపొందించినట్లు తెలిపారు. పక్షోత్సవాల్లో భాగంగా వచ్చిన 249 మరుగుదొడ్ల దరఖాస్తుదారులకు మంజూరు ఇచ్చి లబ్ధిదారుల ఇంటికెళ్లి అనుమతి పత్రాలు ఇచ్చామన్నారు. ఐఈసీ, ఐపీసీ కార్యక్రమాల ద్వారా సంపూర్ణ పారిశుద్ధ్యం–సుస్థిరతపై ప్రజ లకు అవగాహన కల్పించినట్లు ఆమె చెప్పారు. ఈ సమావేశంలో ఎస్‌బీఎం డీసీ కర్ణాకర్, ఎంఐఎస్ రాజన్న తదితరులు పాల్గొన్నారు.
సమగ్ర శిక్ష ఉద్యోగుల
నిరవధిక సమ్మె
జనగామ: సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేయాలని, ప్రతీ ఉద్యోగికి జీవిత బీమా రూ.20 లక్షలు, ఆరోగ్య బీమా రూ.10 లక్షల కల్పించాలని సమగ్ర శిక్ష ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు తాడూరు రమేష్ డిమాండ్ చేశారు. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టర్ కార్యాలయం ఎదుట తలపెట్టిన నిరవధిక సమ్మెను మంగళవారం ఆయన ప్రారంభించారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు పదవీ విరమణ బెనిఫిట్స్ కింద రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని, ప్రభుత్వ, విద్యాశాఖ నియామకాల వేయిటేజ్ కల్పించాలని, పార్ట్ టైం టీచర్లకు 12 నెలలకు వేతనం అందించాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బైరవని దయాకర్, గోలి రవీందర్‌రెడ్డి, గోరంట్ల యాదగిరి, వెంకటేశ్వర్లు, రాణి అన్నపూర్ణ, రొయ్యల రాజు, మహాలక్ష్మి, రాజశ్రీ,నవీన తదితరులు పాల్గొన్నారు.
పోలీస్‌స్టేషన్ తనిఖీ
తరిగొప్పుల: స్థానిక పోలీస్‌స్టేషన్‌ను డీసీపీ రాజమహేంద్రనాయక్ మంగళవారం తనిఖీ చేశారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రిసెప్షన్, కోర్టు డ్యూటీ ఆఫీసర్, స్టేషన్ రైటర్, రికార్డులను తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. గ్రామాల్లో గస్తీ పెంచాలని, డయల్ 100 ఫిర్యాదుకు వేగంగా స్పందించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ పార్థసారథి, సీఐ అబ్బయ్య, ఎస్సై గుగులోతు శ్రీదేవి, సిబ్బంది పాల్గొన్నారు.
కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి
జనగామ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల కేసీఆర్ నాయకత్వంలోనే అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందిందని మున్సిపల్ చైర్‌పర్సన్ పోకల జమునలింగయ్య అన్నారు. మంగళవారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు, ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ప్రతిష్ఠించడంపై నిరసన వ్యక్తం చేస్తూ జనగామ ఆర్టీసీ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతనం ఆమె మాట్లాడుతూ తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో ఉద్యమనేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయడంతోనే ఆనాడు యూపీఏ ప్రభుత్వం దిగొచ్చి, రాష్ట్రం ఇచ్చిందన్నారు. సకల జనుల సమ్మతితో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలను కాంగ్రెస్ ప్రభుత్వం మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు తాళ్లసురేష్‌రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పసుల ఏబేలు, మసిఉర్ రెహమాన్, జూకంటి లక్ష్మిశ్రీశైలం, కర్రె శ్రీనివాస్, అనిత, ముస్త్యాల దయాకర్, మామిడాల రాజు, బండ యాదగిరిరెడ్డి, సేవెల్లి మధు, ధర్మపురి శ్రీనివాస్, తిప్పారపు విజయ్, సతీష్, గుర్రం నాగరాజు, ఉల్లెంగుల నర్సింగ్, రాజ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment