విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
జనగామ: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్‌తో కలిసి బీసీ, ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలకు సంబంధించిన అధికారులు, డీఎంహెచ్‌ఓ, డీడబ్ల్యూఓ, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బీసీ, ఎంజేపీ, ఎస్సీ, ఎస్టీ, కేజీబీవీ, మోడల్, అర్బన్, మైనార్టీ రెసిడెన్షియల్ గురుకులాలు, వసతి గృహాలు, పాఠశాలలు 66 ఉన్నాయన్నారు. ఇందులో 12,940 మంది విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు. ఇందులో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ఇందుకు సంబంధించిన యాక్షన్ ప్లానన్‌ను రూపొందించుకోవాలన్నారు. పదో తరగతిలో జిల్లాను నంబర్ వన్ స్థానంలో ఉంచేందుకు ప్రత్యేక తరగతుల ద్వారా ప్రతీ సబ్జెక్టుపై తర్పీదును ఇవ్వాలన్నారు. అధికారులు వసతి గృహాలను సందర్శించి, ఆహారం, మౌలిక వసతి సౌకర్యాలపై జాగ్రత్తలు పాటించే విధంగా పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్, డీడబ్ల్యూఓ ఫ్లోరెన్స్, పీఆర్ ఈఈ శ్రీనివాస్ రావు, మిషన్ భగీరథ ఈఈ శ్రీకాంత్, సంక్షేమ పాఠశాలల అధికారి విక్రమ్, మున్సిపల్ కమిషనర్, తదితరులు ఉన్నారు.
ఇంటర్‌లో మెరుగైన ఫలితాలు..
ఈ విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షల్లో మెరుగైన ఫలితాల సాధనకు ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు కృషి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా కోరా రు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) పింకేష్‌కుమార్‌తో కలిసి జూనియర్, డిగ్రీ కళా శాలల ప్రిన్సిపాల్స్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యార్థుల చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఉత్తీర్ణత శాతాన్ని పెంచి జిల్లాను ఆదర్శంగా నిలపాలన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ అధి కారి రవీదర్, డీఎస్‌డబ్ల్యూడీఓ విక్రమ్, ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.
12వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా రూపొందించిన ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 12వ తేదీలోపు తెలి యజేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రిజ్వాన్ బాషా రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్‌తో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడారు. జిల్లాలో మొత్తం 283 గ్రామ పంచాయతీలు, 2,576 వార్డులు ఉండగా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ 2,576 పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను తయారు చేసినట్లు స్పష్టం చేశారు. 12వ తేదీన అన్ని మండలాల పరిధిలోని రాజకీయ పార్టీల ప్రతినిధుల ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు ఎంపీడీఓలు నిర్వహించే సమావేశంలో అభ్యంతరాలు స్వీకరిస్తారన్నారు. అభ్యంతరాలను 13వ తేదీన పరిష్కరించి, ఈ నెల 17న తుది పోలింగ్ కేంద్రాల జాబితాను విడుదల చేస్తామన్నారు. అలాగే వరంగల్–ఖమ్మం–నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం డ్రాఫ్ట్ ఓటరు జాబితాకు సంబందించి గత నెల 23 నుంచి ఈ నెల 9వ తేదీ వరకు నిర్వహించిన వినతులు, అభ్యంతరాల ప్రక్రియలో జిల్లా వ్యాప్తంగా 170 కొత్త ఫారం, 19 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. తుది ఓటరు జాబితాను డిసెంబర్ 30న వెల్లడిస్తామన్నారు. ఈ సమావేశంలో డీపీఓ స్వరూప, ఆయా పార్టీల ప్రతినిధులు భాస్కర్, రవి, విజయ భాస్కర్, ప్రకాష్, చంద్ర శేఖర్, హరికృష్ణ తదితరులు ఉన్నారు.
యాక్షన్ ప్లాన్‌ను రూపొందించుకోవాలి
సమీక్షలో కలెక్టర్ రిజ్వాన్ బాషా
Comments
Please login to add a commentAdd a comment