మహిళలను కించపర్చిన ప్రభుత్వం
దేవరుప్పుల/కొడకండ్ల/పాలకుర్తి టౌన్: తెలంగాణ సాధన దిశలో రూపొందించిన తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మను కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా తీసేసి మహిళలను కించపర్చారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. మంగళవారం మండలంలోని సీతారాంపురంలో తెలంగాణ తల్లి విగ్రహ మార్పును నిరసిస్తూ బీఆర్‌ఎస్ పిలుపు మేరకు శివాజీ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహంలోని బతుకమ్మను తొలగించి యావత్ తెలంగాణ మహిళల మనోభావాలను దెబ్బతీస్తూ, మహిళాభివృద్ధి పాటుపడుతున్నామనడం తగదన్నారు. తెలంగాణ సాధన ఉద్యమకారులు ఆవుల వీరన్న, బస్వ రమేష్, బాషిపాక కొండయ్య తదితరులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు పల్ల సుందర్‌రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అలాగే కొడకండ్ల మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ఎర్రబెల్లి పాల్గొని తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సిందె రామోజీ, వెంకటేశ్వర్‌రావు పాల్గొన్నారు. అలాగే పాలకుర్తి మండలం దర్దేపల్లిలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చి న హామీల అమలులో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలమైందన్నారు. పసునూరి నవీన్, ఎల్ల య్య, ప్రకాష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిషేకం
Comments
Please login to add a commentAdd a comment