రూ.వేల కోట్ల బిల్లులు పెండింగ్
జనగామ: ఈ–కుబేర్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయుల బిల్లులు రూ.వేల కోట్లలో పెండింగ్‌లో ఉన్నాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో జరుగుతున్న సైన్స్ ఫెయిర్‌ను బుధవారం సందర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత మార్చి నుంచి పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు పైసా రావడం లేదన్నారు. పెండింగ్ బిల్లులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై ఉపముఖ్యమంత్రిని కలిసి పెండింగ్ ఫైల్స్‌ను క్లియరెన్స్ చేయాలని కోరడం జరిగిందన్నారు. పట్టణ, నగర ప్రాంతాల్లో జనాభా పెరుగుదలకు తగ్గట్టుగా ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేసే దిశగా సర్కారు ఆలోచన చేయాలన్నారు. నిత్యందన జీవితంలో సైన్స్ లేకుండా జీవితం ఉండదన్నారు. థర్మల్ విద్యుత్‌ను తగ్గించి పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి మడూరి వెంకటేష్, ఆకుల శ్రీనివాస్, చంద్రభాను, మాడిశెట్టి కృష్ణమూర్తి, చలపతి, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ
అలుగుబెల్లి నర్సిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment