ప్రతీఒక్కరికి సమాన హక్కులు
జనగామ: ధనిక, పేద తేడా లేకుండా ప్రతిఒక్కరూ రాజ్యాంగపరమైన సమాన హక్కులు పొందవచ్చని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్‌కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని వికాస్ ఫార్మసీ కళాశాలలో మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకుని చ ట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ 1948 డిసెంబర్ 10వ తేదీ నుంచి మానవహక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. తమ హక్కులను హరించే సమయంలో పోరాడే హక్కు ప్రతీఒక్కరికి ఉంటుందన్నారు. జనగామ సీడబ్ల్యూసీ చైర్మన్ ఉప్పలయ్య మాట్లాడుతూ మావవ హక్కుల ఒప్పందం ప్రకారం పిల్లలు, పెద్దలకు హక్కులను కల్పించడం జరిగిందన్నారు. డీసీపీఓ రవికాంత్, చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ రవికుమార్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న పిల్లలు 1098 నంబర్‌ను సంప్రదించాలన్నారు. ఈ సదస్సులో స్కోప్ ఎన్‌జీఓ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ మనోజ్ కుమార్ తదితరులు ఉన్నారు.
సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment