జనగామ రూరల్: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఎన్‌ఎంహెచ్‌లో తొమ్మిది ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ మల్లికార్జునరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఒప్పంద ప్రాతిపదికన నియామకం ఉంటుందని అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలను జిల్లా అధికారిక వెబ్‌సైట్ jangon.telangna.gov.inలో పొందవచ్చని, అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తుకు సంబంధిత సర్టిఫికెట్లు జతచేసి ఈనెల 13 నుంచి 19వ తేదీ సాయంత్రం 5.00 గంటల లోపు డీఎంహెచ్‌ఓ కార్యాలయములో అందజేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment