ఉత్సాహంగా ‘గణిత ప్రతిభా’ పరీక్ష
జనగామ రూరల్: జనగామ పట్టణంలోని ధర్మకంచ జెడ్పీహెచ్‌ఎస్‌లో బుధవారం జిల్లా స్థాయి గణిత ప్రతిభా పరీక్ష ఉత్సాహంగా జరిగింది. ఉదయం 11 నుంచి 12.30 గంటల వరకు జరిగిన ఈ పరీక్షకు జిల్లా నుంచి 100 మంది విద్యార్థులు హాజరయ్యా రు. టీఎంఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం.లింగం ఆధ్వర్యాన జరిగిన ముగింపు సమావేశంలో డీఈఓ ఎం.రమేష్ మాట్లాడుతూ.. ఈ పరీక్షతో విద్యార్థులకు పోటీతత్వం అలవడుతుందన్నారు. అనంతరం ఇంగ్లిష్, తెలుగు మీడియం రెసిడెన్షియల్ పాఠశాలల నుంచి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన 9 మంది విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. వీరు ఈనెల 18న జరిగే రాష్ట్ర స్థాయి పరీక్షలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ రాజేందర్, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, హెచ్‌ఎం శ్రీనివాసులు, ఏఎంఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment