● టీఆర్‌ఈ నాన్ గెజిటెడ్ అసోసియేషన్
రాష్ట్ర అధ్యక్షుడు రవి
హన్మకొండ : గెజిటెడ్ అధికారుల సంఘాల్లో నాన్ గెజిటెడ్ ఉద్యోగులు సభ్యత్వం తీసుకోవద్దని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండమల్ల రవి అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనలో కోరారు. ఆఫీస్ సబార్డినేట్ నుంచి నాయబ్ తహసీల్దార్ వరకు ఒక సంఘం.. రికార్డు అసిస్టెంట్ నుంచి తహసీల్దార్ వరకని మరో సంఘం అంటున్నదని పేర్కొన్నారు. నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు ఏ జిల్లాలోనైనా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారా అని ప్రశ్నించారు. కేవలం సంఖ్యా బలానికి మాత్రమే వాడుకుంటున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment