గ్రూప్–2 పరీక్షలకు సన్నద్ధం
జనగామ: జిల్లాలో గ్రూప్–2 పరీక్షలకు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 15, 16 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి 12.30, మధ్యాహ్నం 3 నుంచి 5.30 వరకు రెండు సెషన్లలో నిర్వహించే ఈ పరీక్షలకు జిల్లా నుంచి 5,471 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో 16 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. పర్యవేక్షణకు నాలు గు రూట్లను గుర్తించారు. సెంటర్‌కు ఒక అబ్జర్వర్ ను నియమించారు. పరీక్షల నిర్వహణ కోఆర్డినేటర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నర్సయ్య ఆధ్వర్యాన జిల్లా యంత్రాగం పరీక్షల నిర్వహణపై కసరత్తు చేస్తోంది. పరీక్షల సమయంలో ఇబ్బందులు తలెత్త కుండా డీసీపీ రాజమహేంద్రనాయక్ పర్యవేక్షణలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు చేపట్టనున్నారు.
క్రమశిక్షణ, స్థిరత్వం అవసరం
ఇటీవల విడుదలైన గ్రూప్–4 ఫలితాల్లో రెవెన్యూ డిపార్టుమెంట్ పరిధి సీసీఎల్‌ఏకు సెలెక్ట్ అయ్యాను. దీనికి ముందు ఎక్సైజ్ కానిస్టేబుల్, ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, కోర్టు జూనియర్ అసిస్టెంట్ జాబ్స్‌కు ఎంపికయ్యాను. ప్రస్తుతం గ్రూప్–2 పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాను. నాకు గెజిటెడ్ ఆఫీసర్ కావాలని చిన్ననాటి కల. గ్రూప్–2 ఉద్యోగం సాధించాలంటే ప్రధానంగా క్రమశిక్షణ, స్థిరత్వం అవసరం. నేను చిన్న నాటి నుంచి యావరేజ్ స్టూడెంట్‌నే. ప్రభుత్వ కొలువు కొట్టాలనే సంకల్పమే ఇన్ని ఉద్యోగాలు వచ్చేలా చేసింది.
పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం..
● సమీక్షలో కలెక్టర్ రిజ్వాన్ బాషా
గ్రూప్–2 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామ ని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్, డీసీ పీ రాజమహేంద్రనాయక్‌తో కలిసి గ్రూప్–2 పరీక్ష నిర్వహణపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే సెంటర్‌కు చేరుకోవాలని, నిర్దేశిత సమయం దాటితే లోనికి అనుమతి ఉండదన్నారు. 5,471 మంది అభ్యర్థులకు 16 సెంటర్లు, సెంటర్‌కు ఒక చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ అధికారి, అజ్జర్వర్, ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 43 మంది బయోమెట్రిక్ అధికారులు, 52 మంది ఐడెంటిఫికేషన్ అధికారులు, నాలుగు రూట్లలో నలుగురు లోకల్, జాయింట్ రూట్ అధికారులను నియమించినట్లు తెలిపారు. పరీక్ష ప్రారంభానికి ముందే ఇన్విజిలేటర్లు ఓఎంఆర్ షీట్‌పై అభ్యర్థులకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లకు అనుమతి లేదని, సెంటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. జిరాక్స్ సెంటర్లను మూసి వేయాలని ఆదేశించా రు. పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు, సమయానుకూలంగా ఆర్టీసీ బస్సులు కల్పంచాలన్నారు. పరీక్ష సమయంలో సీసీ కెమెరాల నిఘాను పరిశీలించాలని పేర్కొన్నారు. డౌన్‌లోడ్ చేసిన హాల్ టికెట్‌పై ఫొటో సరిగా లేకుంటే గెజిటెడ్ అధికారి లేదా చివరగా చదువుకున్న విద్యాసంస్థ ప్రిన్సిపాల్ అటెస్ట్‌తో మూడు పాస్‌పోర్టు ఫొటోలు, వెబ్‌సైట్‌లో పొందు పరిచిన ధ్రువీకరణ పత్రాన్ని పూర్తిచేసి ఇన్విజిలేటర్‌కు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. పరీక్ష రాసే అభ్యర్థులు చెప్పులు మాత్రమే వేసుకుని రావాలని, మెహందీ, తాత్కాలిక టాటూలు వేసుకోవద్దని, అభరణాలు ధరించరాదని సూచించారు. బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తో పాటు గుర్తింపు పొందిన ప్రభుత్వ ఒరిజినల్ ఐడెంటిటీ కార్డును తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలన్నారు. కాగా బయోమెట్రిక్ విధానంపై అధికారులు, ఇన్విజిలేటర్‌లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్–9052308621లో సంప్రదించాలని సూచించారు. సమీక్షలో ఏసీపీ పార్థసారథి, డీడబ్ల్యూఓ ఫ్లోరెన్స్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ వేణుమాధవ్, డీఎంహెచ్‌ఓ మల్లికార్జున్‌రావు, డీఏఓ రామారావు నాయక్, పోలీసు, అధికారులు పాల్గొన్నారు.
మునుపటి పేపర్లను తిరిగేయండి
డిగ్రీ పూర్తి చేసిన ప్రతీ అభ్యర్థి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో గ్రూప్–2 పరీక్షకు సన్నద్ధం అవుతున్నారు. చివరి ప్రిపరేషన్‌లో అత్యధిక మార్కుల సాధనే లక్ష్యంగా ప్రిపేర్ కావాలి. గతంలో టీజీపీఎస్‌సీ నిర్వహించిన గ్రూప్–2 పేపర్‌లను ఒకటికి రెండుసార్లు తిరిగేయాలి. పరీక్షలో ఎదుర్కొనే ప్రశ్నల రకాలను స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
– బెల్లపురి సాయికుమార్, కెరీర్ గైడెన్స్ ఎక్స్‌పర్ట్
●
– నోముల అనిల్, జనగామ,
గ్రూప్–4 రెవెన్యూ శాఖ ఉద్యోగి
15, 16 తేదీల్లో నిర్వహణ
అభ్యర్థులు 5,471 మంది.. సెంటర్లు 16
నాలుగు రూట్లు.. 16 మంది అబ్జర్వర్లు
సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు
సందేహాల నివృత్తికి టోల్ ఫ్రీ నంబర్–90523 08621
Comments
Please login to add a commentAdd a comment