వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
జనగామ రూరల్: ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు ధర్మకంచ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నాముని పావని అన్నారు. బుధవారం విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఉత్తీర్ణత శాతం పెంపునకు నిత్యం సబ్జెక్టు లెక్చరర్ల సమక్షంలో స్టడీ అవర్ నిర్వహిస్తామని చెప్పారు. విద్యార్థుల ఏకాగ్రత పెరగడానికి ధ్యానం, మానసిక వికాసానికి అవగాహన, క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మానసిక ఒత్తిడికి లోనుకాకుండా ఇంటర్ బోర్డు టెలి మా నస్ ప్రోగ్రాం, 14416 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సమస్యలు, సందేహాలను నివృత్తి చేసుకోవచ్చ ని చెప్పారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడకుండా విద్యార్థులను తల్లిదండ్రులు ఎప్పుడూ గమనిస్తూ ఉండాలని సూచించారు.
మాదిగలను ఒకే వేదికపైకి తేవడమే లక్ష్యం..
స్టేషన్‌ఘన్‌పూర్: రాజకీయ పార్టీలకు అతీతంగా మాదిగలను ఒకే వేదిక మీదకు తీసుకురావడమే లక్ష్యంగా మాదిగల ఐక్య సంక్షేమ సంఘం పనిచేస్తున్నదని ఆ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు రవీందర్ అన్నారు. ఈనెల 15న జిల్లా కేంద్రంలో సంఘం జిల్లా సదస్సు నిర్వహిస్తున్న నేపథ్యంలో బుధవారం ఘన్‌పూర్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ సందర్భంగా నిర్వహించే జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి మాదిగలు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జన్ను రాములు, కార్యదర్శి గాదె సుధాకర్, అరూరి కార్తీక్, గుర్రం శ్రీను, దావీద్, గుర్రం రాజు, మునిగె ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
చిరు వ్యాపారులపై
వేధింపులు మానుకోవాలి●
● సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు గోపి
జనగామ రూరల్: తోపుడు బండ్లు, చిరు వ్యాపారులపై మున్సిపల్, పోలీసు అధికారుల వేధింపులు మానుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బూడిద గోపి అన్నారు. ఈ మేరకు బుధవారం మున్సిపల్ కార్యాలయం వద్ద పార్టీ ఆధ్వర్యాన చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. పట్టణ కేంద్రంలో తోపుడు బండ్లపై పండ్లు, కూరగా యలు, సోడా ఇతర వస్తువులు విక్రయించే చిరు వ్యాపారులపై అభివృద్ధి పేరుతో మున్సి పల్ అధికారులు, ట్రాఫిక్ పేరుతో పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు. ప్రత్యామ్నాయం చూపకుండా బండ్లను తొలగించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధన కార్యదర్శి విజేందర్, మండే రమేష్‌కుమార్, గాదపాక దానమ్మ, నీల పద్మ, దేవరాజు ప్రమీల, ధనాల వరలక్ష్మి, పల్లెర్ల సిద్ధిలక్ష్మి, కాగితాల సునీత, చంద్రగిరి శ్రీనివాస్, మార్తమ్మ సాలమ్మ, షరీఫ్‌ఉద్దీన్ బాలలక్ష్మి, చల్ల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలి●
● ఏసీపీ అంబటి నర్సయ్య
పాలకుర్తిటౌన్: శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు కృషి చేయాలని ఏసీపీ అంబటి నర్సయ్య అన్నారు. బుధవారం స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన రిజిస్టర్ల నిర్వహణ, కేసుల విచారణపై ఎస్సైల కు సూచనలు చేశారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ స్టేషన్‌కు సంబంధించి కేసులు పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడూ పరిష్కరించాలని సూచించారు. నేరాలు, దందాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. కార్యక్రమంలో సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్సైలు పవన్‌కుమార్, సీహెచ్.రాజు, సృజన్‌కుమార్, శ్రావన్‌కుమార్, స్వాతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment