అధిక సాంద్రత సాగు లాభదాయకం
చిల్పూరు: అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు లాభదాయకమని ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్ర వేత్త డాక్టర్ అనిల్‌కుమార్ అన్నారు. చిన్నపెండ్యాలలో సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఏరువాక కేంద్రం ఆధ్వర్యాన ఏఓ నజీరుద్ధీన్ అధ్యక్షతన నిర్వహించిన రైతు శిక్షణ కార్యక్రమంలో మాట్లాడా రు. అధిక సాంద్రత పత్తి సాగులో మొక్కలు, వరుసల మధ్య దూరం తగ్గించి ఎకరాకు 25 వేల నుంచి 35 వేల మొక్కలు వచ్చేలా విత్తుకోవాలన్నారు. ఈ పద్ధతిన వర్షాధారంగా ఎకరాకు 9–13 క్వింటాళ్ల దిగుబడి పొందవచ్చని, రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా రూ.5,000 ఖాతాలో జమచేస్తుందని చెప్పారు. శాస్త్రవేత్తలు మమత, మధుశేఖర్, దేశ్పాండే ఫౌండేషన్ మేనేజర్ వెంకటేశ్వర్లు, శరత్‌బాబు, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
● ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ అనిల్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment