రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ
జనగామ రూరల్/బచ్చన్నపేట/నర్మెట: రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. జిల్లాలోని క్యాంపు కార్యాలయం నుంచి అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్ సింగ్‌లతో కలిసి కలెక్టర్ ఆదివారం ఆర్డీఓలు, ఎస్డీసీలు, జిల్లా, మండల స్థాయి ప్రత్యేక అధికారులు ఎంపీడీఓలు, ఎంపీఓలు, తహసీల్దార్‌లతో నాలుగు పథకాల అమలుపై ఆ టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి సంబంధిత అధికారులకు సూచనలు చేసి వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నెల 26న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు వంటి కీలకమైన నాలుగు సంక్షేమ పథకాలను అమలు చేయడానికి క్షేత్రస్థాయి సర్వే పరిశీలనలో అలసత్వం వహించకుండా రేపటి లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి రేషన్ కార్డులు జారీ చేయడం జరుగుతుందన్నారు. రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్లు నిరంతర ప్రక్రియ అన్నారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే విషయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ నెల 21నుంచి 24 వరకు నిర్వహించే గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులను స్వీకరించడంతో పాటు ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకొని పరిశీలించనున్నట్లు వివరించారు. గ్రామ, వార్డు సభల నిర్వహణకు బ్యానర్‌లను ఏర్పాటు చేయాలన్నారు. లబ్ధిదారుల ముసాయిదా జాబితాను పారదర్శకంగా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో జనగామ ఆర్డీఓలు గోపీరామ్, వెంకన్న, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమాన్ నాయక్, డీఆర్డీఓ వసంత, డీపీఓ స్వరూప, డీసీఎస్‌ఓ సరస్వతి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డీఏఓ రామారావు నాయక్, హౌసింగ్ ఈఈ మత్రు నాయక్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మండలంలోని శామీర్‌పేట, పసరమడ్ల గ్రామ పంచాయతీల్లో, మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో గల ఇందిరమ్మ కాలనీలో అధికారులను నిర్వహిస్తున్న సర్వే ప్రక్రియను పరిశీలించారు. బచ్చన్నపేట మండల పరిధిలోని గోపాల్‌నగర్‌లో సర్వే ప్రక్రియను పరిశీలించారు. అలాగే నర్మెట మండల పరిధిలోని బొమ్మకూర్‌లో సర్వే ప్రక్రియను పరిశీలించి పలు సూచనలు చేశారు. పలుచోట్ల ఇంటింటికీ వెళ్లి ఆయా కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలపై ఆరా తీసి సందేహాలను నివృత్తి చేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు.
గ్రామసభల్లో దరఖాస్తుల స్వీకరణ
కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా
Comments
Please login to add a commentAdd a comment