ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి
జనగామ రూరల్: ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాల ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి.రవీంద్ర శర్మ అన్నారు. జిల్లా సబ్ జైలులో ఖైదీల హక్కుల గురించి శనివారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. ఖైదీలు విడుదలైన తర్వాత తప్పు చేయొద్దని, ఇందుకోసం లీగల్ అవేర్నెస్ క్యాంపుల ద్వారా వారిని చైతన్యవంతులుగా మార్చి నేర ప్రవృత్తి లేకుండా చేయవచ్చని చెప్పా రు. సీనియర్ సివిల్ జెడ్జి సి.విక్రమ్ మాట్లాడుతూ ష్యూరిటీ పెట్టుకోలేని పేదవారు, బెయిల్ వచ్చి 14 రోజులు దాటిన వారు దరఖాస్తు చేసుకుంటే న్యాయం అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్‌లో 24 గంటల కన్నా ఎక్కువ సేపు ఉంచొద్దని, అలా ఎవరైనా ఉంటే వారి బంధువులు తమ దృష్టికి తీసుకుని వస్తే జడ్జి ఆదేశానుసారం ఆ కేసులను టేకప్ చేస్తామని తెలిపారు. అందరూ స్నేహభావంతో ఉండాలని, ఖైదులందరూ తమ బంధువులతో మాట్లాడటానికి ఉన్న ములాఖత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి జి.శశికల, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె.సందీప, డిఫెన్స్ కౌన్సిల్ ఎం.రవీంద్ర, జైలర్ కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్రశర్మ
Comments
Please login to add a commentAdd a comment