వివరాలు పకడ్బందీగా నమోదు చేయాలి
కాళేశ్వరం: ఇందిరమ్మ ఇళ్ల సర్వే వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. ఽబుధవారం మహాదేవపూర్ మండల కేంద్రంలోని గంజి గంగమ్మ ఇంటి నమోదు ప్రక్రియను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన ప్రతీలబ్ధిదారుడి వివరాలు పక్కాగా నమోదు చేయాలని ఆదేశించారు. రోజుకు ఎన్ని కుటుంబాల వివరాలు నమోదు చేస్తున్నారు, క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా లబ్ధిదారుల వివరాలను మొబైల్ యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. ఈ నెల చివరి వరకు సర్వే పూర్తి చేయాలన్నారు.
పార్కు అభివృద్ధికి చర్యలు
కాళేశ్వరంలోని ముక్తివనం పార్కు అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. బుధవారం డీఎఫ్‌ఓ నవీన్ కుమార్‌రెడ్డితో కలిసి కాళేశ్వరంలోని ముక్తివనం పార్కును పరిశీలించారు. పార్కులోని వృక్షాలను, ట్రీహౌస్, వాచ్ టవర్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా పార్కుకు సిరొంచ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులను ముక్తివనం పార్క్ గురించి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరం దేవస్థానానికి అతి సమీపంలో ఉన్నందున పార్కు అభివృద్ధితో ఈ ప్రాంతం ప్రాధాన్యం మరింత పెరుగుతుందన్నారు. అనంతరం పార్కు మ్యాప్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి వీరభద్రయ్య, డిప్యూటీ తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఎఫ్‌ఎస్‌ఓ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు చదువుతోపాటు
క్రీడల్లోనూ రాణించాలి
కలెక్టర్ రాహుల్ శర్మ
నూతన మెనూ ప్రకారం..
మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలను కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నూతన మెనూ ప్రకారం అల్పాహారం, భోజనం పెడుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కూరగాయలు, బియ్యం భద్రపరచు స్టోర్ రూం, కిచెన్, ఆర్‌ఓ ప్లాంట్, కంప్యూటర్ ల్యాబ్, నూతన మెనూ చార్ట్‌ను పరిశీలించారు. విద్యార్థులతో పాఠాలు చదివించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యంతో చదువుకొని ఉన్నతశిఖరాలు అధిరోహించాలన్నారు. మరమ్మతుకు గురైన కంప్యూటర్లను తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి వీరభద్రయ్య, ఏటీడీఓ క్షేత్రయ్య, హెచ్‌ఎం బాలకృష్ణ, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, డిప్యూటీ తహసీల్దార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలాగే మహదేవపూర్ మండలం, టస్సార్ కాలనీలో పట్టువస్త్రాలు నేస్తున్న ప్రక్రియను కలెక్టర్ పరిశీలించి పట్టు వస్త్రాల మార్కెటింగ్ సౌకర్యం కల్పనకు కలెక్టరేట్ కార్యాలయంలో ప్రతీ సోమవారం స్టాల్ ఏర్పాటు చేయించాలని డీఆర్‌డీఓకు సూచించారు. ఇందిరా మహిళా శక్తిలో ఏర్పాటు చేసిన మిఠాయి షాపును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సంజీవరావు, డీఆర్డీఓ నరేష్, సెరికల్చర్ అధికారి సమ్మయ్య, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment