రైలు పట్టాలు కాదు.. రోడ్డే
ఈ ఫొటోలో కన్పిస్తున్నది.. రైలు పట్టాలు అనుకుంటే మీరు పొరపడినట్టే.. 353సీ జాతీయ రహదారిపై అధిక లోడుతో ఇసుక, బొగ్గు లారీలు వెళ్తుండడంతో రోడ్డు ఇలా గాడీలు పడి రైలు పట్టాలను తలపిస్తోంది. దీంతో భూపాలపల్లిలోని హన్మాన్ దేవాలయం నుంచి కేటీకే 5వ గని మూల మాలపు వరకు, కాటారం నుంచి భూపాలపల్లి వరకు ఈ మార్గంలో ద్విచక్రవాహనదారులు ఇబ్బంది పడుతూ ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. పనులు చేపట్టిన సంబంధిత కాంట్రాక్టర్ నాణ్యతాప్రమాణాలు పాటించకపోవడం, జాతీయ రాహదారి విభాగం అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రోడ్డు పరిస్థితి ఇలా మారిందని ప్రజలు, ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
– భూపాలపల్లి అర్బన్
Comments
Please login to add a commentAdd a comment