సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో పని చేస్తున్న కార్మికులకు సొంతింటి కలను నేరవేర్చడమే లక్ష్యంగా యాజమాన్యంతో మాట్లాడుతున్నట్లు ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ తెలిపారు. ఏరియాలోని కేటీకే 5వ గనిలో గురువారం గని ఫిట్ కార్యదర్శి దోర్నాల తిరుపతి అధ్యక్షతన ఏర్పాటుచేసిన గేట్ మీటింగ్‌కు రాజ్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సింగరేణిలో ప్రస్తుతం ఉన్న పాత బావులు మరో పదేళ్ల వరకు పనిచేస్తాయని.. ఆ తర్వాత నూతన గనులు రావాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికులకు ఇచ్చిన హామీలను యాజమాన్యంతో స్టక్చ్రర్ సమావేశాల్లో మాట్లాడి పరిష్కరిస్తామని తెలిపారు. సింగరేణి కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఆదాయపన్ను మినహాయింపుపై కోలిండియాలో 9వ వేజ్ బోర్డు చర్చలలో ఒప్పందాలు జరిపినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచి నాయకులు మాతంగి రామచందర్, ఎండీ ఆసిఫ్ పాష, రవికుమార్, మల్లికార్జున్, కుమారస్వామి, నాగేంద్రబాబు, రాజేందర్, తిరుపతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment