భూగర్భ జల పన్ను
ఎక్స్‌ట్రాక్షన్ చార్జీలు
(భూమిలో ఇంకిన 100 లీటర్లలో)
70 లీటర్లు తోడితే సేఫ్‌జోన్
70–90 లీటర్లు సెమీ క్రిటికల్
90–100 లీటర్లు క్రిటికల్
100 లీటర్లకు పైగా.. ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్
హన్మకొండ: విస్తరిస్తున్న నగరాలు, పట్టణాలు.. పెరుగుతున్న జనాభా అవసరాల నిమిత్తం భూ గర్భ జలాల వినియోగం రోజురోజుకూ అధికమవుతోంది. తాగునీరు వ్యాపార వస్తువుగా మారిపోయి ంది. విచ్చల విడిగా బోర్లు వేసి నీటిని తోడుతున్నా రు. ఫలితంగా భూగర్భంలో నీరు అడుగంటి వందలాది అడుగుల లోతుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో భూగర్భ జలాల వెలికితీతను నియంత్రించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. వాల్టా చట్టాన్ని అనుసరించి తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ ఎక్స్‌ట్రాక్షన్ రూల్స్–23ను తీసుకొచ్చింది. దీని ప్రకారం.. వాణిజ్య అవసరాలకు వినియోగించే నీటికి పన్ను చెల్లించాలి. లైసెన్స్‌తో పాటు జిల్లా భూగర్భ జలశాఖ ద్వారా నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలి. ఈ నిబంధనల అమలులో అధికారు ల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల భూగ ర్భ జలశాఖ అధికారులు రాష్ట్ర భూగర్భ జలాల వెలికితీత నియమాలపై అవగాహన కల్పిస్తున్నారు.
దృష్టి సారించని అధికారులు
2023 సంవత్సరంలో ఈ నియమాలు వచ్చినప్పటికీ.. ఇటీవలి వరకు అధికారులు శ్రద్ధ పెట్టకపోవడంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు అమలుకు నోచుకోలేదు. నగర, పట్టణ ప్రాంతాల్లో వాణిజ్య అవసరాలకు నీటిని విచ్చలవిడిగా వినియోగిస్తున్నా.. పర్యవేక్షించిన సందర్భాలు కనిపించలేదు. భూగర్భ జలాల నియంత్రణకు విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేసి నియంత్రించాల్సి ఉండగా.. ఆ దిశగా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టిన దాఖలాలు లేవని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడా జీఓ ఎంఎస్ 15 అమలు జరగడం లేదని తెలుస్తోంది.
పన్ను వేటికంటే..
పరిశ్రమలు, ఆస్పత్రులు, షాపింగ్‌మాళ్లు, హోటళ్ల వంటివి, అధిక నీరు వినియోగించే అపార్టుమెంట్లు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ యూనిట్లు, మైనింగ్ ప్రాజెక్టులు, బల్క్ వాటర్ సప్లయర్లు, నిర్దేశిత ఫారమ్‌లో ఆన్‌లైన్‌లో సంబంధిత జిల్లా భూగర్భ జలశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. రోజుకు 20 వేల లీటర్లకుపైగా భూగర్భజలాలు వాడుకునే అపార్ట్‌మెంట్లు, హౌసింగ్ సొసైటీలు మురుగు నీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలి. శుద్ధి చేసిన నీటిని టాయిలెట్ ఫ్లషింగ్‌కు, కార్ వాషింగ్, గార్డెనింగ్‌కు వినియోగించుకోవాలి. వాణిజ్య అవసరాలకు భూగర్భ జలాలు వినియోగించుకునే సంస్థలు, పరిశ్రమలు కచ్చితంగా డిజిటల్ వాటర్ ఫ్లో మీటర్‌ను బిగించుకోవాలి. ఈమీటర్‌ను క్రమం తప్పకుండా పరిశీలించి డేటాను భూగర్భ జలశాఖకు సమర్పించాలి. ప్యాకేజ్డ్, బల్క్ నీటి సరఫరా చేసే వాహనాలు జీపీఎస్ అమర్చుకోవాలి.
అతిక్రమిస్తే జరిమానా..
నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం వాణిజ్య సంస్థలు వాటి వినియోగ సామర్థ్యాన్ని బట్టి రూ.14,500 నుంచి రూ.42వేల వరకు రెన్యువల్‌కు రూ.10 వేలు, మైనింగ్ ప్రాజెక్టులు కొత్తగా, రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకునేందుకు రూ. లక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ షరతులు ఉల్లంఘిస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కాగా.. భూగర్భ జలాల వినియోగాన్ని బట్టి ఆయా సంస్థలు ప్రభుత్వానికి ఎక్స్‌ట్రాక్షన్ చార్జీలు చెల్లించాలి. వీటిని నాలుగు కేటగిరీలుగా విభజించారు.
వాణిజ్య అవసరాలకు తప్పనిసరి
లైసెన్స్.. నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిందే
గృహ, వ్యవసాయ అవసరాలకు మినహాయింపు
నిబంధనల అమలులో అధికారుల జాప్యం
ప్రతి జిల్లాలో ఏడుగురు
సభ్యులతో విజిలెన్స్ కమిటీ
Comments
Please login to add a commentAdd a comment