టీఎన్జీఓ క్యాలెండర్ ఆవిష్కరణ
భూపాలపల్లి అర్బన్: తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం(టీఎన్జీఓ) నూతన సంవత్సర క్యాలెండర్‌ను గురువారం కలెక్టర్ రాహుల్‌శర్మ ఆవిష్కరించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు బూరుగు రవి ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో కలెక్టర్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు దశరథం, రామారావు, ఠాకూర్, జ్ఞానేశ్వర్‌సింగ్, అన్వర్‌బేగ్, వంశీకృష్ణ, వేణు, అలివేలు, మురళీధర్ పాల్గొన్నారు.
బదిలీలపై నిషేధం
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో మే 31వ తేదీ వరకు బదిలీలపై నిషేధం విధిస్తున్నట్లు సింగరేణి డైరెక్టర్(పా) వెంకటేశ్వరరెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణి యాజమాన్యం 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని విధించగా డిసెంబర్ వరకు 46.30 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లు తెలిపారు. మిగిలిన ఉత్పత్తిని సాధించేందుకు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
వసతులు కల్పించాలి
కాటారం: తమకు పలు వసతులు కల్పించాలని కోరుతూ కాటారం సబ్ డివిజన్ పరి ధిలోని చర్చ్ పాస్టర్లు గురువారం కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్‌కు వినతిపత్రం స మర్పించారు. ఐదు మండలాల్లో సేవ చేస్తున్న చర్చ్ పాస్టర్లకు ప్రభుత్వం తరఫున నూతన చర్చిలు, నూతన గృహాలు, చర్చిల చుట్టూ కంపౌండ్ వాల్స్, బోర్‌వేల్స్, గ్రామాల్లో క్రైస్తవ సమాధుల స్థలాల మంజూరుకు కృషి చేయాల ని సబ్‌కలెక్టర్‌ను కోరారు. తమ వినతిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమకు వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని వేడుకున్నా రు. అనంతరం సబ్ కలెక్టర్‌ను పాస్టర్లు శాలు వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కా టారం సబ్ డివిజన్ పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీ సభ్యులు పాస్టర్ అబ్రహం, పాస్టర్ డేవిడ్‌మార్క్, ఆదాము, ప్రకాశ్, బన్సిలాల్, రవిసందార్‌రావు, యోహాను, పాల్ గట్టయ్య, దానియేలు, జీవరత్నం ఇస్సాక్, చందు పాల్గొన్నారు.
‘తునికాకు యూనిట్ల
రద్దు దుర్మార్గం’
గోవిందరావుపేట: తునికాకు యూనిట్ల రద్దు దుర్మార్గమని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు బండారు రవికుమార్ అన్నారు. మండలంలోని పస్రాలో గల పార్టీ కార్యాలయంలో కొప్పుల రఘుపతి ఆధ్వర్యంలో పార్టీ నాయకులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 300 యూనిట్ల తునికాకు టెండర్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. ఆ ప్రమాదం జిల్లాకు ఉందని అందుకే తెలంగాణలో వెంటనే తునికాకు టెండర్లు పిలవాలని కోరారు. తునికాకు గిరిజనులు, పేద ప్రజలకు ఒక పంట లాంటిదని వివరించారు. కేంద్ర ప్రభుత్వం బడా పెట్టుబడిదారుల కోసం అడవిలో యురేనియం తవ్వకాల కోసం తునికాకు యూనిట్లు రద్దు చేస్తుందని వివరించారు. ఇప్పటికే కోట్ల రుపాయల తునికాకు బోనస్ ప్రజలకు చెల్లించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు. వెంటనే తునికాకు బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు.
7న మెగా జాబ్‌మేళా
గోవిందరావుపేట: జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 7వ తేదీన జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కలెక్టరేట్ అధికారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువత జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఈజిఎంఎం ఎంప్లాయీమెంట్ జనరేషన్ మార్కెటింగ్ మిషన్ ద్వారా ఈ నెల 7న మండల పరిధిలోని చల్వాయిలో గల పీఎస్‌ఆర్ గార్డెన్‌లో జాబ్ మేళాను మంత్రి సీతక్క ప్రారంభిస్తారని వెల్లడించారు. జిల్లాలోని పదో తరగతి నుంచి పీజీ వరకు ఉత్తీర్ణులైన వారు పాల్గొని ఉద్యోగం పొందాలని సూచించారు. ఈ జాబ్‌మేళాలో వివిధ కంపెనీలకు సంబంధించిన 50 కంపెనీలు పాల్గొంటాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment