గర్భిణులు పోషకాహారం తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

గర్భిణులు పోషకాహారం తీసుకోవాలి

Published Fri, Jan 3 2025 2:02 AM | Last Updated on Fri, Jan 3 2025 2:02 AM

గర్భిణులు పోషకాహారం తీసుకోవాలి

గర్భిణులు పోషకాహారం తీసుకోవాలి

రేగొండ: గర్భిణులు నాణ్యమైన పోషకాహారాన్ని తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మధుసూదన్‌ అన్నారు. కొత్తపల్లిగోరి మండలంలోని జగ్గయ్యపేట అంగన్‌వాడీలో గురువారం పోషకాహార దినోత్సవం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మధుసూదన్‌ మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలకు అంగన్‌వాడీలో అందజేసే పౌష్టికాహారాన్ని తీసుకోవాలని అన్నారు. పిల్లలకు వ్యాధినిరోధక టీకాలు క్రమం తప్పకుండా నిర్ధేశించిన సమయానికి వేయించాలని సూచించారు. అంతకుముందు చెన్నాపూర్‌లో నిర్మాణంలో ఉన్న ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ప్రోగ్రాం అధికారి చిరంజీవి, మండల వైద్యాధికారిణి హిమబిందు, సూపర్‌వైజర్‌ రమాదేవి, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement