క్రీడలతోపాటు చదువు అవసరం
చిట్యాల: క్రీడాకారులకు క్రీడలతోపాటు చదువు ఎంతగానో అవసరమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. అదివారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో నిర్వహించిన క్రికెట్ క్రీడోత్సవాల్లో గెలుపొందిన క్రీడాకారులకు ఆయన బహుమతులు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. గ్రామాల్లో ఉన్న క్రీడాకారుల నైపుణ్యాన్ని బయటకు తీసేందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడలను నిర్వహించిందన్నారు. ప్రభుత్వం క్రీడాకారులకు క్రీడా యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. క్రీడాకారులు విద్యతోపాటు తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేయాలని కోరారు. గెలుపొందిన క్రీడాకారులకు మొదటి బహుమతి రూ.10వేలతోపాటు క్రికెట్ కప్ (గర్మిళ్లపల్లి), ద్వితీయ బహుమతి రూ.5వేలతోపాటు షీల్డ్(చిట్యాల) జట్లకు అందజేశారు. కార్యక్రమంలో వ్వవసాయ మార్కెట్ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి–సత్యం, రాష్ట్ర, జిల్లా నాయకులు గాజర్ల అశోక్, ముకిరాల మధువంశీకృష్ణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు గూట్ల తిరుపతి, గడ్డం కోంరయ్య, ఓరం సమ్మయ్య, తిరుపతిరెడ్డి, రాజ్‌మహ్మద్, బుర్ర లక్ష్మణ్‌గౌడ్, కిష్టయ్య, శరత్, రాయకోంరు, రత్నాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.
భూపాలపల్లి రూరల్: జిల్లా నుంచి సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదివారం ఎమ్మెలే క్యాంపు కార్యాలయంలో సొంత ఖర్చులతో టీ షర్ట్స్ పంపిణీ చేశారు. క్రీడల్లో గెలుపొంది జిల్లాకు, నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి రఘు, పార్టీ కౌన్సిలర్లు దాట్ల శ్రీనివాస్, ముంజాల శ్రీనివాస్, నాయకులు, దేవన్, బుర్ర కొమురయ్య, రాజేందర్, శ్రీనివాస్, సాంబమూర్తి, పృథ్వీ, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
Comments
Please login to add a commentAdd a comment