హక్కుల కోసం ఉద్యమించాలి
గోవిందరావుపేట: ముస్లిం మైనారిటీలు తమ హక్కుల కోసం ఉద్యమించాలని ఆవాజ్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి అబ్బాస్ అన్నారు. మండల పరిధిలోని పస్రా పీఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఎండీ గఫూర్ అధ్యక్షతన ముస్లిం మైనారిటీల సమస్యలు, హక్కులపై అవగాహన సదస్సు ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో ముస్లింల మీద రోజురోజుకూ దాడులు పెరుగుతున్నాయన్నారు. 1991 చట్టం ప్రకారం పురాతన కట్టడాలను ముట్టుకోవడానికి వీలు లేదని చెబుతున్న మతోన్మాద శక్తులు దానిని బేఖాతర్ చేస్తూ చట్టాన్ని ధిక్కరిస్తున్నారని విమర్శించారు. ముస్లింలు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నారని తెలిపారు. ఐక్యంగా సంఘటితంగా ఉండడం ద్వారానే హక్కులు సాధించగలుగుతామని తెలిపారు. ప్రతిఒక్కరూ సమస్యల పరిష్కారానికి పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆవాజ్ సంఘం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. నాయకులు ఎస్‌డీ యాసిన్ ఘోరి, సిరాజుద్దీన్, జానీ, మహ్మద్ అప్రోజ్, అబ్దుల్ రహీం తదితరులు పాల్గొన్నారు.
ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్బాస్
Comments
Please login to add a commentAdd a comment