విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
వెంకటాపురం(కె): ఏజెన్సీలో నెలకొన్న విద్యారంగ సమస్యలను అధికారులు తక్షణమే పరిష్కరించాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి అన్నారు. మండల కేంద్రంలో గొండ్వానా సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటాపురం మండలంలోని పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో నూతన మెనూ విధానాన్ని అమలు చేయడం లేదని ఆరోపించారు. ఏజెన్సీలోని పాఠశాలలపై అధికారుల పర్యవేక్షణ లేక విద్యారంగం కుంటుపడుతుందని తెలిపారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించకుండా పాఠశాలలకు వస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఐటీడీఏ పీఓ స్వయంగా పరిశీలించినా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గొండ్వానా సంక్షేమ పరిషత్ నాయకులు పూనెం ప్రతాప్, రేగ గణేశ్, కృష్ణ, కె.వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
గోండ్వానా సంక్షేమ పరిషత్
రాష్ట్ర కార్యదర్శి సాయి
Comments
Please login to add a commentAdd a comment