సాక్షిప్రతినిధి, వరంగల్ : వరంగల్–నల్లగొండ–ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను సోమవారం హనుమకొండ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి.ప్రావీణ్య విడుదల చేశారు. మొత్తం 24,905 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పదవీ కాలం 2025 మార్చి 29తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు పాత ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 30న రద్దు చేసింది.
ఉపాధ్యాయులు తిరిగి తమ ఓటుహక్కును అక్టోబర్ 1 నుంచి నమోదు చేసుకోవాలని. ఆన్‌లైన్ పద్ధతుల్లో ఓటు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మూడు నెలలుగా సాగిన ప్రక్రియ అనంతరం 24,905 మంది అర్హత గల ఓటర్ల తుది జాబితాను విడుదల చేశారు. కాగా ఎన్నికల సంఘం, ఏర్పాట్ల స్పీడును బట్టి వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో ఎన్నికల జరిగే అవకాశం ఉందని ఉపాధ్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment