పెరిగిన నేరాలు
నేర వార్షిక నివేదికను వెల్లడిస్తున్న ఎస్పీ కిరణ్ ఖరే
● జిల్లాలో 10 శాతం అధికం
● చోరీలు, హత్యలు, చీటింగ్ కేసులు గతేడాది కంటే ఎక్కువే..
● 19 శాతం పెరిగిన
రోడ్డు ప్రమాదాలు
● వార్షిక నేర నివేదిక వెల్లడించిన ఎస్పీ కిరణ్ ఖరే
భూపాలపల్లి: జిల్లాలో గతేడాది కంటే నేరాల సంఖ్య 10 శాతం పెరిగినట్లు ఎస్పీ కిరణ్ ఖరే వెల్లడించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ బోనాల కిషన్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావుతో కలిసి నేర వార్షిక నివేదకను వెల్లడించారు. జిల్లాలో చోరీలు, హత్యలు, చీటింగ్ కేసులు, రోడ్డు ప్రమాదాలు.. ఇలా అన్ని కేసులు గతేడాది కంటే ఎక్కువగానే నమోదు అయ్యాయి. డ్రంకెన్ డ్రైవ్ కేసులు 2023లో 1,883 నమోదు కాగా ఈ ఏడాది ఏకంగా 4,231 నమోదయ్యాయి.
మొబైల్ రికవరీలో రెండవ స్థానం..
పోగొట్టుకున్న, దొంగలించబడిన సెల్‌ఫోన్ల రికవరీలో జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలిచింది. జిల్లా పోలీసులు అవార్డులు అందుకున్నారు. సీఈఐఆర్ పోర్టల్‌లో ఈ ఏడాది 731 కేసులు నమోదు కాగా 306 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment