హమాలీల సమస్యలు పరిష్కరించాలి
కాళేశ్వరం: సివిల్ సప్లయీస్ హమాలీ కార్మికుల రేట్ల పెంపునకు సంబంధించిన జీఓను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మహదేవపూర్‌లో సివిల్ సప్లయీస్ గోదాం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం నిరవధిక సమ్మెను ప్రారంభించారు.ఽ ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్ దీక్షలను ప్రారంభించి మాట్లాడారు. హమాలీల రేట్ల పెంపు జీఓను విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. యూనిఫాం, స్వీట్, బోనస్, బట్టల కుట్టు కూలి, మహిళలకు యూనిఫాం, బకాయిలు చెల్లించాలని పలుమార్లు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన సమస్యలను పరిష్కరించకుండా దాటవేసే ధోరణి అవలంభిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కే. రాములు, బాలయ్య, హరిబాబు, అంజన్న, సంపత్ ,సంతోష్ ,వెంకటయ్య, పోచయ్య, ధర్మయ్య, బొందయ్య, రాజయ్య, వెంకటయ్య, ప్రశాంత్, సురేష్, శేఖర్, లక్ష్మయ్య, కృష్ణ, రాజేష్, మదునయ్య, స్వామి, తదితరులు పాల్గొన్నారు.
చిట్యాలలో..
చిట్యాల: సివిల్ సప్లయీస్ హమాలీ కార్మికుల రేట్ల జీఓను వెంటనే విడుదల చేయాలని కోరుతూ మండల కేంద్రంలోని గోదాం వద్ద హమాలీ కార్మికులు బుధవారం నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ కార్యక్రమంలో హమాలీ కార్మిక సంఘం అధ్యక్షుడు సరిగొమ్ముల సురేశ్, ఆరెపల్లి సమ్మయ్య, గుర్రం నర్సయ్య, దాసారపు సాంబయ్య, శీలపాక నాగరాజు, మొలుగూరి ఐలయ్య, హమాలీలు తదితరులు పాల్గొన్నారు.
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్
నిరవధిక సమ్మె షురూ
Comments
Please login to add a commentAdd a comment