అంతర్జాతీయ హ్యాండ్‌బాల్ కోచ్‌గా విష్ణువర్ధన్
వరంగల్ స్పోర్ట్స్: ఈనెల 3 నుంచి 7వ తేదీ వరకు లక్నోలో జరగనున్న అంతర్జాతీయ హ్యాండ్‌బాల్ పోటీల్లో పాల్గొనే ఇండియా పురుషుల జట్టు కోచ్‌గా ఖిలావరంగల్‌కు చెందిన బొడ్డు విష్ణువర్ధన్ నియమితులయ్యారు. ఈమేరకు హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఇండియా జనరల్ సెక్రటరీ డాక్టర్ తేజరాజ్‌సింగ్ బుధవారం నియామక ఉత్తర్వులు జారీ చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. తన నియామకానికి సహకరించిన అసోసియేషన్ ఈడీ డాక్టర్ ఆనంద్ ఈశ్వర్‌పాండే, హ్యాండ్‌బాల్ అసోసియేషన్ తెలంగాణ చైర్మన్, హెచ్‌సీఏ అద్యక్షుడు ఎ.జగన్మోహన్‌రావు, సాట్ వీసీఅండ్‌ఎండ సోనీ బాలాదేవి, సాట్ డీడీ జి.రవీందర్, హనుమకొండ డీవైఎస్‌ఓ అశోక్‌కుమార్‌కు విష్ణువర్ధన్ ధన్యవాదాలు తెలిపారు. ఇండియా టీం కోచ్‌గా ఎంపికై న విష్ణువర్ధన్ ఒలింపిక్స్ సంఘం బాధ్యులు, కోచ్‌లు, క్రీడా సంఘాల బాధ్యులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment